దుండిగల్ రోడ్డు షోలో కేసీఆర్ రెట్టింపు ఉత్సాహంతో ప్రసంగించి, శ్రేణుల్లో నయా జోష్ నింపే ప్రయత్నం చేశారు. రాష్ట్రంలో ఐదు నెల్లల్లోనే పరిస్థితులు తారుమరయ్యాయని.. ఎందుకిట్ల జరిగిందో పట్టణ ప్రాంత ప్రజలు చైతన్యవంతులైన మీరు గ్రహించాలన్నారు. మోడీ పాలనలో అచ్చేదిన్ ఏమోకాని సచ్చేదిన్ వచ్చినాయన్న కేటీఆర్, కేజ్రీవాల్ ను కవితను అరెస్టు చేస్తే అమెరికా లాంటి దేశాలు విమర్శించాయన్నారు. బీజేపీ పాలన అంతా ట్రాష్ అని కేటీఆర్ భగ్గుమన్నారు. గోదావరి కృష్ణా నదీ జలాలు మనకు దక్కాలంటే ఎంపీ అభ్యర్థిగా లక్ష్మారెడ్డి లాంటి కొట్లాడే వీరులను గెలిపించాలన్నారు.
కాంగ్రెస్ ఐదునెల్ల కాలంలో ఎందుకు భూముల ధరలు పడిపోయాయయని, ఎందుకు రియలెస్టేట్ ఆగమైందని ప్రశ్నల వర్షం కురిపించారు. హైదరాబాద్ జంట నగరాలకు నీళ్లు కరెంటు ఆగకుండా ఇచ్చామని, ఇప్పుడేమైందో సర్కారే చెప్పాలన్నారు. కరెంటు పోతోంది, రాష్ట్ర పరువు పోతున్నది
పరిశ్రమలు తరలిపోతున్నాయని, ఈ ముఖమంత్రి రియలెస్టేట్ వాళ్ల దగ్గెర ఆర్ ఆర్ టాక్స్ వసూల్ చేస్తోన్నాడని ఆయన ఆరోపించారు.
స్కేర్ ఫీట్ కింత వసూల్ చేసి ఢిల్లీకి పంపుతున్నాడని ప్రధానమంత్రి స్వయంగా చెప్పిండన్నారు. అవినీతితో రాష్ట్ర పరువు పోతున్నదని, పార్లమెంటులో మనోళ్లు డజన్ మంది ఉంటేనే మన హక్కులు కాపాడుతారన్నారు. అసెంబ్లీ ఎన్నికలల్లో మల్కాజిగిరి పరిధిలో నాలుగు లక్షల మెజారిటీ వచ్చిందని, ఇప్పడు ఇంకా ఎక్కువ రావాలే అన్నారు. మన ఎంపీలు చాలామంది గెలుస్తున్నారని ప్రకటించిన కేటీఆర్..మెదక్ చేవెళ్ల మల్కాజిగిరి సికింద్రాబాద్ మల్కాజిగిరి గిట్ల డజన్ పై చిలుకు సీట్లు గెలవ బోతున్నామని జోస్యం చెప్పారు.