రానున్న శాసనసభ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బడే నాగజ్యోతి గెలుపు కోసం కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని మంత్రి కేటీఆర్ అన్నారు. ములుగు జిల్లా కేంద్రానికి చెందిన పలువురు నాయకులు హైదరాబాదులో కెటిఆర్ సమక్షం లో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ములుగు జిల్లాలు అన్ని రంగాలలో అభివృద్ధి చేయడానికి సీఎం కేసీఆర్ కోట్లాది రూపాయల నిధులను మంజూరు చేశారని, గతంలో ఎన్నడు లేని విధంగా ములుగు జిల్లా అభివృద్ధి చెందిందని అన్నారు. బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించిన పక్షంలో రానున్న రోజులలో మరింత అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. పార్టీలో చేరిన వారిలో ఏలిమి సంతోష్ యాదవ్ అనుచర బృందం ఉన్నారు.
కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మీనరసింహారావు, ఎంఎల్సి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ములుగు జిల్లా సీనియర్ కార్యకర్తలు గడ్డామిది భాస్కర్, బుల్లెట్ ఓదెలు, సోషల్ మీడియా ఇంచార్జి అల్లం రాజశేఖర్ పాల్గొన్నారు.