Saturday, November 15, 2025
HomeతెలంగాణKTR: జూబ్లీహిల్స్‌ నుంచే బీఆర్‌ఎస్‌ జైత్రయాత్ర.. ఆ రెండు చోట్లా ఉప ఎన్నికలు ఖాయం!

KTR: జూబ్లీహిల్స్‌ నుంచే బీఆర్‌ఎస్‌ జైత్రయాత్ర.. ఆ రెండు చోట్లా ఉప ఎన్నికలు ఖాయం!

KTR Jubilee Hills by election campaign: జూబ్లీహిల్స్‌ నుంచే బీఆర్‌ఎస్‌ జైత్రయాత్ర ప్రారంభమవుతుందని ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీ రామారావు అన్నారు. జూబ్లీహిల్స్‌ నియో జకవర్గంలో తిరిగి గులాబీ జెండాను ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణభవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా.. షేక్‌పేట డివిజన్‌ బీజేపీ మాజీ అధ్యక్షుడు తోట మహేశ్‌తో పాటు పలువురు నేతలు బీఆర్‌ఎస్‌లో చేరారు. వారికి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. అనంతరం జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక ప్రచారంలో అనుసరించాల్సిన వ్యూహంపై కేటీఆర్‌ పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు. ఈ ఎన్నికలో పార్టీ గెలుపు ఖాయమని అన్నారు.

- Advertisement -

కాంగ్రెస్‌ పార్టీకి ఓటుతో బుద్ధి చెప్పాలి: హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని స్థానిక ఓటర్లకు కేటీఆర్ సూచించారు. కేసీఆర్ అమలు చేసిన పథకాలను ప్రజలకు మరోసారి గుర్తు చేయాలని సూచించారు. అంతేకాకుండా ప్రచారంలో కాంగ్రెస్‌ వైఫల్యాలను ప్రజలకు గుర్తు చేయలనిఅన్నారు. నగరంలో రోజురోజుకూ దిగజారుతున్న పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, మురికినీటి కాలువల నిర్వహణ వంటి సమస్యలను ఎత్తి చూపాలని కార్యకర్తలకు సూచించారు. రేవంత్ రెడ్డి సర్కార్ హైదరాబాద్‌ అభివృద్ధిని పక్కన పెట్టి.. అవినీతికి పాల్పడుతోందని ఆరోపించారు. గన్ కల్చర్ తెచ్చిన కాంగ్రెస్ కు జూబ్లీహిల్స్‌ ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పాలని కేటీఆర్ కోరారు.

Also Read:https://teluguprabha.net/telangana-news/cm-revanth-participate-in-jubilee-hills-by-election-campaign/

ఆ రెండు చోట్లా ఉప ఎన్నికలు ఖాయం: బీఆర్‌ఎస్‌ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఖైరతాబాద్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యేలపై రాబోయే రోజుల్లో అనర్హత వేటు తప్పదని కేటీఆర్ అన్నారు. ఆ రెండు నియోజకవర్గాల్లో కూడా ఉప ఎన్నికలు వస్తుందని అన్నారు. ఆ రెండు ప్రాంతాల్లో కూడా బీఆర్ఎస్ జెండా ఎగరవేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్‌ నుంచే బీఆర్‌ఎస్‌ జైత్రయాత్ర ప్రారంభమవుతుందని అన్నారు. కలసికట్టుగా కష్టపడాలని నేతలకు సూచించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad