KTR sensational comments Konda Surekha: రేవంత్ రెడ్డి సర్కార్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పాలనలో ఏ వర్గం సంతోషంగా లేదని అన్నారు. వృద్ధుల నుంచి మొదలు నిరుద్యోగ యువతవరకు రేవంత్‌పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని తెలిపారు. సొంత మంత్రులు సైతం సంతోషంగా లేరని అన్నారు.
సురేఖ అక్క కూతురు మాటలే నిలువెత్తు సాక్ష్యం: ప్రజా పాలనపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు గుప్పించారు. నిన్న మొన్నటి వరకు గీతక్క, సీతక్క, సురేఖ అక్క తప్పా.. ఎవరూ సంతోషంగా లేరని చెప్పేవాడినని అన్నారు. కానీ ఇప్పుడు సురేఖ అక్క సైతం సంతోషంగా లేదని కేటీఆర్ వ్యాఖ్యానించారు. వాళ్ల కూతురే ఏడ్చుకుంటూ మా అమ్మ సంతోషంగా లేదని చెబుతోందని తెలిపారు. సురేఖ అక్క కూతురు మాటలే .. ప్రజాపాలనకు నిలువెత్తు సాక్ష్యమని అన్నారు. ఎన్నికల ముందు రేవంత్ చెప్పిన మాటలతో.. అన్ని వర్గాలు మోసపోయాయని తెలిపారు. మంత్రి కూతురే అంతలా బాధపడుతూ తన తల్లి గురించి చెల్పిందంటే.. ఇక సామాన్య ప్రజల బాధలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చని అన్నారు.
Also Read: https://teluguprabha.net/telangana-news/woman-strong-warning-to-pas-of-mps-and-mlas/
రైతుల గోస వర్ణనాతీతం: రాష్ట్రంలో రైతుల గోస వర్ణనాతీతం అని కేటీఆర్ అన్నారు. అక్టోబర్ నెలలో సైతం యూరియా దొరకడం లేదని అన్నారు. పంటలకు సరిపడ కరెంట్ రావడం లేదని తెలిపారు. రైతుబంధు సంగతి ఇక చెప్పక్కర లేదని అన్నారు. రైతులకు రేవంత్ సర్కర్ ఇప్పటికే చాలా బాకీ ఉందని అన్నారు. సమయం వచ్చినప్పుడు రైతులు సరైన జవాబు ఇస్తారని అన్నారు.
అదఃపాతాళానికి భూముల ధరలు: సిరిసిల్ల జిల్లా కేంద్రం అయిన తరవాత భూముల ధరలు పెరిగాయని కేటీఆర్ అన్నారు. కానీ రేవంత్ సర్కార్ పాలనలో మళ్లీ పడిపోయానని తెలిపారు. ఎన్నికల ముందు రూ.31వేలు గజం అమ్మిన వ్యక్తులు ఇప్పుడు రూ.19వేలకు గజం అమ్ముతున్నారని చెప్పారు. ఈ అంశంపైనే సెందులాపూర్ అనే గ్రమానికి వెళ్లి రైతులతో మాట్లాడానని అన్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు ఎకరం రూ.50 లక్షలకు అమ్మితే ఇప్పుడు రూ.21 లక్షలకు అమ్ముకునే పరిస్థితి వచ్చిందని ప్రజలు తెలిపినట్టుగా కేటీఆర్ పేర్కొన్నారు.


