Friday, September 20, 2024
HomeతెలంగాణKTR @ Serilingampally: వరుసపెట్టి కేటీఆర్ రోడ్ షోలు

KTR @ Serilingampally: వరుసపెట్టి కేటీఆర్ రోడ్ షోలు

బీఆర్ఎస్ విజయాలను ఏకరువు పెట్టిన కేటీఆర్

తెలంగాణ రాష్ట్రంలో బలమైన నాయకత్వం, స్థిరమైన ప్రభుత్వం, కెసిఆర్ తోనే సాధ్యమవుతుందని రాష్ట్ర బిఆర్ఎస్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. అభివృద్ధి మా కులం, సంక్షేమమే మా మతం అని ఆయన తన అభిప్రాయం వ్యక్తం చేశారు. తెలంగాణలో బిఆర్ఎస్ ప్రభుత్వం అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలను చేపట్టిందని ఆయన గుర్తు చేశారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో బుధవారం నాడు కెసిఆర్ రోడ్ షోలో పాల్గొన్నారు. తారానగర్ లోని తుల్జా భవాని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి రోడ్ షో ను ప్రారంభించారు. రోడ్ షో తుల్జా భవాని టెంపుల్ నుంచి ప్రారంభమై లింగంపల్లి చౌరస్తా, చందానగర్, గంగారం, మదినగూడ, ఆల్విన్ కాలనీ వరకు చేరుకుంది.

- Advertisement -

వేలాది మంది కార్యకర్తలు కేటీఆర్ రోడ్ షో లో పాల్గొని నిరాజనం పలికారు. అడుగడుగునా దారి పొడవునా వేలాదిమంది కార్యకర్తలు ఉత్సాహంగా ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ తుల్జా భవాని ఆలయం ఎదుట రోడ్ షోలో మాట్లాడారు. మెట్రో రైల్వే లైన్ ను 70 కిలోమీటర్ల నుండి 250 కిలోమీటర్ల వరకు త్వరలో విస్తరించనున్నామని ఆయన సభాముఖంగా ప్రకటించారు. హైదరాబాద్ లో రెండు వందల పై చిలుకు ఉర్దూ పాఠశాలలను నెలకొల్పడం జరిగిందని తెలిపారు.

ఇటీవల సుప్రసిద్ధ సినీ నటుడు రజనీకాంత్ హైదరాబాద్ ను సందర్శించి ఇక్కడి అభివృద్ధిని గమనించి కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రశంసించారని తెలిపారు. అయితే రజనీకాంత్ కి కనిపించిన అభివృద్ధి కాంగ్రెస్, బిజెపి పార్టీలకు కనిపించడం లేదా అని కేటీఆర్ ప్రశ్నించారు.

రాష్ట్రంలో విద్యుత్తు, నీరు, రోడ్లు, కళ్యాణ లక్ష్మి, బస్తీ దవాఖాన లు, ఐటి అభివృద్ధి, ముస్లింలకు అనేక సంక్షేమ పథకాలను చేపట్టిన ఘనత కెసిఆర్ ప్రభుత్వానికి దక్కుతుందని ఆయన చెప్పారు. హైదరాబాద్ లో అభివృద్ధిని చూసి ప్రపంచ దేశాల నుండి అనేక సాఫ్ట్వేర్ సంస్థలు పెట్టుబడులు పెట్టడానికి కంపెనీలు ముందుకు వస్తున్నాయని కేటీఆర్ అన్నారు.

రానున్న ప్రభుత్వంలో ఆడబిడ్డలకు మూడు శుభవార్తలు ఉన్నాయని కేటీఆర్ ప్రకటించారు. సౌభాగ్య లక్ష్మి పథకం ద్వారా అత్తింటి కోడలు 3000 రూపాయల సహాయం చేస్తామని ప్రకటించారు. అలాగే అత్తమ్మలకు ఆసరా పింఛన్లను 5000 రూపాయలను పెంచుతున్నామని తెలిపారు.

ప్రభుత్వం ఏర్పాటు కాగానే గ్యాస్ సిలిండర్ల ధరను 400 రూపాయలకే చేస్తున్నామని ఆయన చెప్పారు. అన్నపూర్ణ పథకం ద్వారా తెల్ల రేషన్ కార్డు ఉన్న నిరుపేదలకు సన్నబియ్యం పంపిణీ చేస్తామని అన్నారు. అలాగే తెల్ల రేషన్ కార్డు కలిగిన రైతు సోదరులకు ఐదు లక్షల బీమా పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తుందని కేసీఆర్ ప్రకటించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News