Saturday, July 6, 2024
HomeతెలంగాణKTR support unemployees: రేవంత్ సర్కారు వచ్చి నెలలైనా ఉద్యోగాలకు ఎంపికైన జాబితా ప్రకటించరా?

KTR support unemployees: రేవంత్ సర్కారు వచ్చి నెలలైనా ఉద్యోగాలకు ఎంపికైన జాబితా ప్రకటించరా?

ఉద్యోగాలకు ఎంపికైన ఏఈఈ (సివిల్) జాబితాను ప్రభుత్వం వెంటనే ప్రకటించాలని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలంటూ కేటీఆర్ ను కలిసిన పరీక్ష రాసిన అభ్యర్థులతో ఆయన మాట్లాడారు. టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డితో ఫోన్లో మాట్లాడిన కేటీఆర్

- Advertisement -

బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నిర్వహించిన ఏఈఈ (సివిల్) పరీక్షకు 1180 పోస్టులకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక జాబితాను ప్రకటించటంలో కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇప్పటి వరకు ఉద్యోగాలకు ఎన్నికైన వారి జాబితాను వెల్లడించకుండా ఆలస్యం చేస్తుందన్నారు. దాదాపు 22 నెలల కిందే ఈ పరీక్షకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలై, ఎగ్జామ్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ కూడా గతేడాది సెప్టెంబర్ నాటికే పూర్తైందని, అభ్యర్థుల తుది జాబితా విడుదల చేయాల్సి ఉండగా ఎన్నికల కోడ్ కారణంగా నిలిచిపోయిందన్నారు.

కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలు గడుస్తున్న ఇప్పటి వరకు ఈ తుది జాబితాను విడుదల చేయటం లేదన్నారు.. దీంతో అభ్యర్థులు తీవ్ర గందరగోళంలో ఉన్నారని, ప్రభుత్వం వెంటనే ఈ జాబితా ప్రకటించాలని కేటీఆర్ కోరారు.

ఈ పరీక్ష రాసిన అభ్యర్థులు భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను నందినగర్ లోని కేటీఆర్ ఇంట్లో కలిశారు. ఈ జాబితాను వెంటనే ప్రకటించేలా ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. తప్పకుండా వారికి అండగా ఉంటానని కేటీఆర్ వారికి భరోసా ఇచ్చారు. వెంటనే టీజీపీఎస్సీ ఛైర్మన్ మహేందర్ రెడ్డికి ఫోన్ చేసి మాట్లాడారు. వెంటనే ఎంపికైన అభ్యర్థుల జాబితాను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News