Wednesday, January 8, 2025
HomeతెలంగాణKTR: నా మాటలు రాసి పెట్టుకోండి.. బలంగా పుంజుకుంటాం: కేటీఆర్‌

KTR: నా మాటలు రాసి పెట్టుకోండి.. బలంగా పుంజుకుంటాం: కేటీఆర్‌

ఫార్ములా ఈ-రేసు(Formula E-Race) వ్యవహారంలో ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌(KTR) దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. అలాగే కేటీఆర్‌ను అరెస్ట్‌ చేయకుండా గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను కూడా ఉపసంహరించుకుంది. దీంతో కేటీఆర్ అరెస్ట్ ఖాయమంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. మరోవైపు హైకోర్టు తీర్పు నేపథ్యంలో కేటీఆర్‌కు ఈడీ మరోసారి నోటీసులు ఇచ్చింది. జనవరి 16న విచారణకు హాజరుకావాలని పేర్కొంది.

- Advertisement -

తాజా పరిణామాలపై కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. ‘‘నా మాటలు రాసి పెట్టుకోండి. ఈ ఎదురుదెబ్బల నుంచి బలంగా పుంజుకుంటాం. ఈ అబద్ధాలు నన్ను దెబ్బతీయలేవు. ఆ ఆరోపణలు నన్ను తగ్గించలేవు. కుట్రలతో నా నోరు మూయించలేరు. నేటి అడ్డంకులే రేపటి విజయానికి దారి తీస్తాయి. నేను న్యాయవ్యవస్థను గౌరవిస్తాను. న్యాయం గెలుస్తుందనేది నా అచెంచెల విశ్వాసం. సత్యం కోసం నా పోరాటం కొనసాగుతుంది. నా పోరాటానికి ఈ ప్రపంచమే సాక్షిగా నిలుస్తుంది’’ అని రాసుకొచ్చారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News