Thursday, January 23, 2025
HomeతెలంగాణKTR: ఐటీ ఉద్యోగులు నాకు గర్వకారణం: కేటీఆర్

KTR: ఐటీ ఉద్యోగులు నాకు గర్వకారణం: కేటీఆర్

దావోస్ (Davos) పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) తనను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) స్పందించారు. ఈమేరకు ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. ఐటీ పరిశ్రమలలో ఉండాలంటే నిజమైన ప్రతిభ, విద్య, అంకితభావం అనేవి చాలా అవసరం. కానీ సంచుల కొద్ది డబ్బులతో ఎమ్మెల్యేలను కొనడానికి, ఢిల్లీ బాసులకి డబ్బులు పంపడానికి ఇవేమీ అవసరం లేదు. ఐటీ ఉద్యోగుల విద్యార్హతలకు, వారి నిబద్ధతకు కొందరు యాక్సిడెంటల్ రాజకీయ నాయకులు సరితూగరు. అలాంటి వారు ప్రవేశపట్టే అనాలోచిత విధానాలకు మనం భారీ మూల్యం చెల్లించుకుంటున్నాం.

- Advertisement -

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఐటీ ఉద్యోగులు ఎంతో కష్టపడి జీవనోపాధిని పొందుతున్నారు. ఐటీ, ఐటీ అనుబంధ సంస్థల్లో పనిచేస్తున్న నా అక్కాచెల్లెళ్లు, అన్నాదమ్ముళ్లకు సలాం.. మీ మేధస్సు, అవిశ్రాంత శ్రమే ఆధునిక సాంకేతిక ప్రపంచానికి వెన్నుముక. మీరు లేకుంటే ప్రగతి రథచక్రాలు ఆగిపోతాయి. నా విద్యార్హతలు, నా ఉద్యోగ అనుభవం, ఐటీలో నా నేపథ్యం, ముఖ్యంగా ఐటీ రంగంలో ఉన్న ఉద్యోగులు నాకు ఎప్పటికి గర్వకారణం” అని తెలిపారు. కాగా ఓ ఇంటర్వ్యూలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కేటీఆర్ ఐటీ ఎంప్లాయ్ కాబట్టి ఉద్యోగుల మైండ్ సెట్ ప్రకారం ఆలోచిస్తారని.. తాను రాజకీయ నాయకుడిని కాబట్టి పాలసీల గురించి ఆలోచిస్తాను అని చెప్పారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News