Sunday, January 5, 2025
HomeతెలంగాణKTR: ఇది కక్ష్యా? ఇది శిక్ష్యా? ఇది నిర్లక్ష్యమా?: కేటీఆర్

KTR: ఇది కక్ష్యా? ఇది శిక్ష్యా? ఇది నిర్లక్ష్యమా?: కేటీఆర్

పదేళ్లలో ఎవరెస్ట్ శిఖరమంత ఎత్తు ఎదిగిన గురుకులాల గౌరవం.. ఏడాదిలో ఎందుకు పడిపోయిందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్ కేటీఆర్‌(KTR) కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈమేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.

- Advertisement -

ఇది కక్ష్యా ? ఇది శిక్ష్యా? ఇది నిర్లక్ష్యమా ? పదేళ్లలో ఎవరెస్ట్ శిఖరమంత ఎత్తు ఎదిగిన గురుకులాల గౌరవం.. ఏడాదిలో ఎందుకు పడిపోయింది ? గురుకులాలను ఉద్దేశపూర్వకంగా పక్కనపెట్టే ప్రయత్నం చేస్తున్నారా ? ఇది కక్ష్యా? ఇది శిక్ష్యా? ఇది నిర్లక్ష్యమా? అని ప్రశ్నించారు. మండలానికి ఒక్క గురుకుల పాఠశాలకు మాత్రమే పరిమితం చేసే కుట్ర దాగి ఉందా ? అని మండిపడ్డారు. అందుకే ఉద్దేశపూర్వకంగా విద్యార్థుల్లో, విద్యార్థుల తల్లిదండ్రులలో అభద్రతా భావం పెంచుతున్నారా ?

ఏడాదిలో 50 మందికి పైగా విద్యార్థులు మరణించినా ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు ? ప్రతిష్ఠాత్మకంగా సీఎం నుండి మంత్రుల వరకు కామన్ డైట్ అంటూ అట్టహాసంగా ప్రారంభించింది ఆరంభ శూరత్వమేనా? మాజీ సీఎం కేసీఆర్ పాలనలో దేశానికి ఆదర్శం.. నేడు అంతులేని నిర్లక్ష్యం. విద్యార్థులు గురుకులాల నుండి పారిపోయే పరిస్థితికి కారణమెవ్వరు?” అని కేటీఆర్ నిలదీశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News