Friday, November 22, 2024
HomeతెలంగాణKTR Warangal tour: వరంగల్ సిటీలో కేటీఆర్ సుడిగాలి పర్యటన

KTR Warangal tour: వరంగల్ సిటీలో కేటీఆర్ సుడిగాలి పర్యటన

వరంగల్ ట్రై సిటీలో పరుగులు పెడుతున్న అభివృద్ధి

668 కోట్ల 97 లక్షల విలువైన పలు అభివృద్ధి పనులు, వివిధ సంక్షేమ పథకాల పంపిణీ వంటి అనేక కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు మంత్రి కేటీఆర్. తెలంగాణ రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మాత్యులు కల్వకుంట్ల తారక రామారావు వరంగల్ ట్రై సిటీలో సుడిగాలి పర్యటన చేపట్టారు. ముందుగా ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలకు హెలికాప్టర్లో చేరుకొని అక్కడినుండి రోడ్డు మార్గాన అన్ని అభివృద్ధి కార్యక్రమాలకు రిబ్బన్ కటింగ్ చేశారు కేటీఆర్ వెంట మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ , చీఫ్ విప్ దాస్యం వినయభాస్కర్,
TSLC డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్, భాస్కర్, నగర మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ZP chairman డాక్టర్ సుధీర్ కుమార్, ఎమ్మెల్యేలు ఆరూరి రమేష్, నన్నపనేని నరేందర్, తదితరులు మంత్రి వెంట ఉన్నారు.

- Advertisement -

మొదట జిడబ్ల్యూ ఎంసీ ఆధ్వర్యంలో ప్రగతి నగర్ లోని 48 కోట్లతో నిర్మించిన 15 ఎంఎల్డి STPను, 30 లక్షల వ్యయంతో చేసిన ఎన్ఐటి జంక్షన్ ను, బస్తి దవాఖానను ప్రారంభించారు, మడికొండలో Quadrant IT టెక్నాలజీలో 500 మందికి ఉపాధి కల్పించే కార్యాలయాన్ని ప్రారంభించారు కేటీఆర్.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News