Saturday, November 23, 2024
HomeతెలంగాణKTR: పెట్టుబడులకు రెడ్ కార్పెట్ వేశాం

KTR: పెట్టుబడులకు రెడ్ కార్పెట్ వేశాం

దేశంలో జనాభాకు తగ్గట్టుగా ప్రభుత్వ రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించలేం, అందుకే ప్రైవేట్ లో పెట్టుబడులకు ఆహ్వానం

తెలంగాణ రాష్ట్రం అనుసరిస్తున్న పారిశ్రామిక విధానం వల్ల పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్రంలో రెడ్ కార్పెట్ పరిచామని రాష్ట్ర పరిశ్రమలు, ఐటి,మున్సిపల్ శాఖ మంత్రి కే. తారకరామారావు అన్నారు. మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర మండలం మూసాపేట మండలం వేముల వద్ద 500 కోట్ల రూపాయలతో నిర్మించనున్న ఎస్ జి డి కార్నింగ్ కంపెనీకి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి తారక రామారావు మాట్లాడుతూ.. దేశంలో జనాభాకు తగ్గట్టుగా ప్రభుత్వ రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించలేమని, అందువల్ల ప్రైవేట్ లో పెట్టుబడులు ఆహ్వానించి ఉద్యోగాలు కల్పించే విధంగా చూస్తున్నట్లు ఆయన వెల్లడించారు. వేముల వద్ద ఏర్పాటు చేసిన ఎస్జిడీ కార్నింగ్ కంపెనీ ద్వారా 1500 నుండి 2000 మంది వరకు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆయన వెల్లడించారు. ఇటీవలే దిటిపల్లి వద్ద 9500 కోట్లతో అమరరాజా కంపెనీని ఏర్పాటు చేశామని, మహబూబ్నగర్ జిల్లాలో ఐటి హబ్ లో ఎంతోమందికి ఉద్యోగాలు రానున్నాయని తెలిపారు.

- Advertisement -

తెలంగాణ రాష్ట్రం 9 బిలియన్ల వ్యాక్సిన్ కు హబ్ గా ఉందని , నూతన పారిశ్రామిక విధానంతో టి ఎస్ బి పాస్ వల్ల 15 రోజుల్లోనే కంపెనీలకు అనుమతిస్తుండడంతో కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ఎర్రతివాచి పరిచామని, దేశంలో 142 కోట్ల జనాభాకు కేవలం 59 లక్షల ఉద్యోగాలు మాత్రమే ఉన్నాయని, అదే తెలంగాణలో నాలుగు కోట్ల జనాభాకు ఆరున్నర లక్షల మందికి ఉద్యోగాలు ఉన్నట్లు మంత్రి వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం అనతి కాలంలోనే అన్ని రంగాలలో అభివృద్ధి చెందిందని, కేసీఆర్ నాయకత్వంలో ఏ రాష్ట్రంలో జరగనంత అభివృద్ధి ఈ రాష్ట్రంలో జరిగిందని అన్నారు.
ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి, జడ్చర్ల శాసనసభ్యులు డాక్టర్ సి. లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, జిల్లా కలెక్టర్ జి. రవి నాయక్, ఎస్ పి కే. నరసింహ, అచంపేట శాసనసభ్యులు ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు ఎస్ జి డి కారనింగ్ సంస్థ ఎండి అక్షయ్ సింగ్, డైరెక్టర్ లైఫ్ సైన్సెస్ శక్తి నాగప్ప, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News