Saturday, November 23, 2024
HomeతెలంగాణKTR welcoming new year with GHMC workers: వెరైటీగా న్యూ ఇయర్ సెలబ్రేట్...

KTR welcoming new year with GHMC workers: వెరైటీగా న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకున్న కేటీఆర్

తెలంగాణ భవన్ లో పారిశుధ్యకార్మికులతో కలిసి భోజనం

నూతన సంవత్సరాన్ని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారక రామారావు వినూత్నంగా ప్రారంభించారు. ఈరోజు తెలంగాణ భవన్ లో అయన పారిశుధ్యకార్మికులతో కలిసి భోజనం చేశారు. నూతన సంవత్సర వేడుకలను తెలంగాణ భవన్లో కార్మికులతో కలిసి జరుపుకుని వారితో సంభాషించారు. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కెటిఅర్ తో పారిశుద్ద్య కార్మికులతో సెల్ఫీలు దిగారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం మూడుసార్లు శానిటరీ కార్మికులకు వేతనాలు పెంచిందన్నారు. పట్టణాలకు, పల్లెలకు అత్యంత కీలకమైన పారిశుధ్య కార్మికులకు తాము ప్రాధాన్యత ఇచ్చామని, వారికి గౌరవం పెంచెలా జీతాలు పెంచామన్నారు. భవిష్యత్తులోనూ వారికి అండగా ఉంటామని, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. జిహెచ్ యంసి పరిధిలో సమస్యలను చెబితే ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి ప్రయత్నం చేస్తామన్నారు. ఈ విషయంలో తమ పార్టీ మేయర్ విజయలక్ష్మితో సమన్వయం చేసుకోవాలన్నారు.

- Advertisement -

పలువురు కార్మికులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను మాజీ మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకొచ్చారు. జీతాల పెంపుతోపాటు, అరోగ్య భద్రత, ఉద్యోగ భద్రత కావాలన్నారు. ఇతర అవుట్ సొర్సింగ్ కార్మికుల మాదిరే తమకు కూడా ఇతర సదుపాయాలు కల్పించేలా ప్రభుత్వంపైన ఒత్తిడి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు.

కేటీఆర్ ను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన నాయకులు

నూతన సంవత్సరాన్ని సందర్భంగా కేంద్ర పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను పలువురు నేతలు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. వీరిలో మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, చామకూర మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు రాజీవ్ సాగర్, దూదిమెట్ల బాలరాజుయాదవ్, నగేష్, పలువరు విద్యార్ధి నాయకులు, పార్టీశ్రేణులు ఉన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వేలాది మంది కార్యకర్తలను కెటిఅర్ కలిసారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News