Sunday, July 7, 2024
HomeతెలంగాణKukatpally: లంక శివరామ ప్రసాద్ కి శేషేంద్ర లైఫ్ టైం అఛీవ్మెంట్ అవార్డ్

Kukatpally: లంక శివరామ ప్రసాద్ కి శేషేంద్ర లైఫ్ టైం అఛీవ్మెంట్ అవార్డ్

కూకట్ పల్లి జేఎన్టీయూ యూనివర్సిటీ లో జరిగిన శేషేంద్ర శర్మ గారి 16 వ వర్ధంతి సాహిత్య సదస్సు కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరయ్యారు తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి.
జేఎన్టీయూ విసి కట్టా నరసింహా రెడ్డి, సాహిత్య సదస్సు నిర్వాహకులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. శేషేంద్ర శర్మ చిత్రపటానికి పూల మాల వేసి నివాళులు అర్పించి, సాహిత్య సదస్సును ఆయన ప్రారంభించారు. అనంతరం ప్రముఖ డాక్టర్ , కవి అయిన లంక శివరామ ప్రసాద్ కి శేషేంద్ర జీవిత సాఫల్య పురస్కారం అవార్డ్ ని అందజేశారు. కవిత్వ సంపుటి ,ఆత్మ ,కాపీ టేబుల్ బుక్,తెలంగాణ, ఆధునిక మహా భారతం పుస్తకాలను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ “కవిగా,
విమర్శకుడిగా ,సాహిత్య వేత్తగా ,వక్త గా గుంటూరు శేషేంద్ర శర్మ గొప్ప ఖ్యాతిని పొందరన్నారు. ఆయన మున్సిపల్ కమిషనర్ గా కూడా విశేషమైన సేవలను అందించారని తెలిపారు.నా దేశం నా ప్రజలు,నీరై పారిపొయింది గొరిల్లా ,రక్త రేనా వంటి రచనల ద్వారా మంచి గుర్తింపు ఆయన పొందారని తెలిపారు. 1975లో విడుదలైన ప్రముఖ తెలుగు సినిమా “ముత్యాల ముగ్గు “లో నిదురించే తోటలోకి పాట ఒకటి ఉంది వచ్చింది అనే పాటను ఆయన రాసారని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం కవులు ,కళాకారుల కోసం సంక్షేమ పథకాలను అమలు చేస్తూ వారిని ఆదుకొంటుందని తెలిపారు.ముఖ్యమంత్రి కేసీఆర్ గారు స్వయంగా రచయిత కావడం వలన కళ రంగాన్ని ప్రోత్సహిస్తున్నారని చెప్పారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో జేఎన్టీయూ వి,సి కట్టా నరసింహ రెడ్డి, ప్రముఖ డాక్టర్ లంక శివరామ ప్రసాద్, ప్రొఫెసర్ రఘు, ప్రొఫెసర్ రామ చంద్రమౌళి, అసోసియేట్ ప్రొఫెసర్ శ్రీధర్, ప్రముఖ సినీ నటులు ఎల్ బి శ్రీరాం, ఎస్ శివారెడ్డి, పత్తి పాక మోహన్ , మంత్రి శ్రీదేవి, సత్యకి , జె సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News