ముఖ్యమంత్రి కెసిఆర్ తనను నమ్మి బిఆర్ఎస్ పార్టీ టికెట్ కేటాయించినందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, కూకట్పల్లిలో చేసిన అభివృద్ధిని చూసి ప్రజలు బ్రహ్మాండమైన మెజారిటీతో బిఆర్ఎస్ పార్టీని గెలిపిస్తారని బిఆర్ఎస్ పార్టీ కూకట్ పల్లి అభ్యర్థి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు.
కూకట్పల్లి నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నామినేషన్ సందర్భంగా మొదటగా కుటుంబ సభ్యుల సమేతంగా కె.పి.హెచ్.బి. కాలనీలోని వినాయక ఆలయంలో, కూకట్పల్లి హనుమన్ ఆలయంలో పూజలు చేసి కూకట్ పల్లి మసీదులో ముస్లిం మత పెద్దలు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం తన మాతృమూర్తి ఆశీర్వాదం తీసుకొని ఎమ్మెల్సీ నవీన్ కుమార్ తో కలిసి కూకట్ పల్లి నుండి ర్యాలీగా నామినేషన్ వేసేందుకు బయలుదేరారు.
ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ కూకట్పల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీర్వాదంతో మంత్రి కేటీఆర్ సహకారంతో వేల కోట్ల రూపాయలతో మంచినీటి సమస్యను, ట్రాఫిక్ సమస్యను నిర్మూలించామన్నారు. కూకట్పల్లి నియోజకవర్గంలో వేల మందికి సంక్షేమ పథకాలు అందించిన ఘనత బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానికి చెందుతుందన్నారు.
ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారమే అభివృద్ధి చేసి చూపెట్టామని నియోజకవర్గంలో కొంత ట్రాఫిక్ సమస్య ఉందని మరోసారి ప్రజలందరూ ఆశీర్వదించి గెలిపించినట్లయితే కూకట్పల్లి నియోజకవర్గంలో ట్రాఫిక్ సమస్య లేకుండా చేస్తామన్నారు. ఎమ్మెల్సీ నవీన్ కుమార్ , కార్పొరేటర్లకి , కార్యకర్తలకి ధన్యవాదాలు తెలిపారు.