కులాంతర వివాహం చేసుకున్న ఐదుగురు జంటలకు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆర్థిక సాయం అందచేశారు. ఈమేరకు కృష్ణారావు క్యాంప్ కార్యాలయంలో ఒక్కొక్కరికి 2.5లక్షల రూపాయలు చొప్పున ఫిక్స్డ్ డిపాజిట్ చేక్కులను అందించారు.. ఇవి మూడు సంవత్సరాల అనంతరం వారికి 3,30,355 రూపాయలు అందుతుంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ ..ముఖ్యమంత్రి కేసీఆర్ నిరుపేదలకు సంక్షేమ పథకాలు అందించడమే కాకుండా.. ప్రతి ఒక్కరికి అండగా నేనున్నానంటూ ఈ విధంగా కులాంతర వివాహం చేసుకున్న వారికి భరోసా కల్పించడం అనేది చాలా సంతోషించదగ్గ విషయమన్నారు. తెలంగాణ రాష్ట్రం అన్ని విభాగాల్లో ఆదర్శ రాష్ట్రంగా దేశానికి దిక్సూచి అయిందని అన్నారు.