Monday, December 4, 2023
HomeతెలంగాణKuna Srisailam Goud: జనసేన జంగ్ సైరన్ సభలో గర్జించిన శ్రీశైలం గౌడ్

Kuna Srisailam Goud: జనసేన జంగ్ సైరన్ సభలో గర్జించిన శ్రీశైలం గౌడ్

బీజేపీ, జనసేన కార్యకర్తలు, అభిమానులతో సందడి

కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో జనసేన పార్టీ, బిజెపి బలపరిచిన ఎమ్మెల్యే అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్ కి మద్దతు తెలిపేందుకు నియోజకవర్గ ఇంచార్జ్ నందగిరి సతీష్ ఆధ్వర్యంలో షాపూర్ నగర్ లోని ఎంజె గార్డెన్ లో జనసేన జంగ్ సైరన్ సభను ఏర్పాటు చేసారు.

- Advertisement -

ఈ కార్యక్రమానికి బీజేపీ అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్ హాజరై, జనసైనికులకు తన ధన్యవాదాలు తెలిపారు. కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ, జనసేన మద్దతుతో కుత్బుల్లాపూర్ లో బీజేపీ గెలవడం ఖాయమని అన్నారు. పవన్ కళ్యాణ్ అంటే తనకు వ్యక్తిగతంగా ఎంతో అభిమానమని అన్నారు.

రాబోయే రోజుల్లో కుత్బుల్లాపూర్ లోని జనసేన నాయకులకు సముచిత స్థానం కల్పిస్తానమని, వారికి అన్ని విధాలుగా అండగా ఉంటానని తెలిపారు. క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న వారు, వీర మహిళలు, అధినేత పవన్ కళ్యాణ్ అభిమానులు పాల్గొని బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్ కి మద్దతు నిలిచి గెలిపిస్తాం అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు డా.ఎస్ మల్లారెడ్డి, బీజేపీ నాయకులు, జనసేన నాయకులు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News