Saturday, November 23, 2024
HomeతెలంగాణKuna Srisailam: సూపర్ మ్యాక్స్ కంపెనీ కార్మికుల సమస్యలు తీరుస్తా

Kuna Srisailam: సూపర్ మ్యాక్స్ కంపెనీ కార్మికుల సమస్యలు తీరుస్తా

సూపర్ మాక్స్ కంపెనీ కార్మికులతో భేటీ

రానున్న ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి మద్దతిచ్చి తనను గెలిపించాలని సూపర్ మాక్స్ కంపెనీ కార్మికులను కోరారు. సూపర్ మాక్స్ కంపెనీ కార్మికులతో బీజేపీ అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్, బీజేపీ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు డా.ఎస్ మల్లారెడ్డి సమావేశమయ్యారు. ఎన్నో రోజులుగా కార్మికులు దీక్ష చేస్తున్నా బీఆర్ఎస్ అభ్యర్థి పట్టించుకోలేదని, సమస్య పరిష్కరించాలని ఎమ్మెల్యే నివాసానికి వెళ్తే సరైన విధంగా స్పందించలేదని సూపర్ మాక్స్ కార్మికులు శ్రీశైలం గౌడ్ కి తెలిపారు. కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ పదవిలో ఉన్నా లేకున్నా కార్మికులకు అండగా ఉన్నాను. కార్మికుల కోసం అనేకసార్లు అరెస్ట్ అయ్యాను. కార్మికుల సమస్యల గురించి కనీసం ప్రభుత్వం దృష్టికి తీసుకుపోలేని దగుల్బాజీ ఎమ్మెల్యే, ఈ బీఆర్ఎస్ అభ్యర్థి అని, ఎన్నికల సందర్బంగా బీఆర్ఎస్ అభ్యర్థి చెప్పే మాయమాటలు నమ్మొద్దు అని, మళ్ళీ ఎన్నికలయ్యాక పట్టించుకోడని, సూపర్ మాక్స్ కంపెనీ కార్మికుల సమస్యలు తాను గెలిస్తే పరిష్కరిస్తానని, కార్మికులకు రావాల్సిన ప్రతి పైసా ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. సూపర్ మాక్స్ కంపెనీ కార్మికుల గురించి నా మేనిఫెస్టోలో కూడా పెడుతున్నానని ఆయన వెల్లడించగా కార్మికులు బీజేపీ అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్ కి తమ సంపూర్ణ మద్దతు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సూపర్ మ్యాక్స్ కంపెనీ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

- Advertisement -

శ్రీశైలంకు జై కొట్టిన కాపులు..

స్థానికంగా ఉన్న కాపు సామాజికవర్గం వారు ఇప్పటికే శ్రీశైలంకు జై కొడుతున్నారు. సేవా సమితి నాయకులు దుర్గారావు, పుప్పాల మధు మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకే బీజేపీ అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్ కి మద్దతు తెలిపారు.కాపులంతా ఏకమై బిజెపిని గెలిపించాలని తీర్మానం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాపు సేవాసమితి నాయకులు కోనేటి వీర వెంకట సత్యనారాయణ, గౌరిశెట్టి శివేశ్వర్ రావ్, ఏసుబాబు, కొట్టే రమణ, సూర్య చంద్ర రావ్, డీఎస్ రావ్, తదితరులు పాల్గొన్నారు.

ప్రచారంలో జోరు పెంచి..

తన ప్రచారాలకు స్థానికంగా మంచి స్పందన వస్తోందన్న ఉత్సాహంలో ఉన్న కూన శ్రీశైలం గౌడ్.. బిజెపి అభ్యర్థి ప్రచారానికి ప్రజల నుండి అపూర్వ స్పందన వస్తుందన్నారు. కాలనీ సంక్షేమ సంఘం సభ్యులతో సమావేశమైన ఆయన.. స్వచ్ఛందంగా తరలి వచ్చి తనకు మద్దతు తెలిపిన వారందరికీ థాంక్స్ చెప్పారు.


అందుకే ఎమ్మెల్యే గేటెడ్ కమ్యూనిటీకి మారిండు..

కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ, జీడిమెట్ల డివిజన్ ఈ తొమ్మిదేండ్ల బీఆర్ఎస్ పాలనలో నాలాల ఆక్రమణలు, పరిశ్రమల కాలుష్యంతో నిండిపోయింది. అందుకే ఎమ్మెల్యే వివేకానంద కుత్బుల్లాపూర్ విలేజ్ నుండి గేటెడ్ కమ్యూనిటీలకు మారిండని ఆరోపించారు. తాను ఎమ్మెల్యేగా గెలిచాక జీడిమెట్ల డివిజన్ ను అన్ని రకాలుగా అభివృద్ధి చేయిస్తానని, అన్ని కాలనీల్లో మౌలిక వసతులు కల్పిస్తానని, గతంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నపుడు చేసిన అభివృద్ధి పనులే ఉన్నాయన్నారు. పదవులు ఉన్నా లేకున్నా ప్రజలకు సేవ చేసినా, ప్రజల కోసం పనిచేసే బిడ్డగా నాకు ఈ ఎన్నికల్లో అవకాశం ఇవ్వండన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News