Thursday, September 19, 2024
HomeతెలంగాణKunamneni: హామీలు నెరవేర్చే దాకా పోరాటం

Kunamneni: హామీలు నెరవేర్చే దాకా పోరాటం

నల్ల బ్యాడ్జిలతో మోడీకి నిరసన చెబుతాం

మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఎమ్ కన్వెన్షన్ ప్రయివేట్ హాల్లో జరిగిన సిపిఐ విలేకరుల సమావేశంలో ముఖ్య అతిథులుగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పాల్గొని మాట్లాడారు… బీజేపీ ప్రభుత్వాన్ని అధికారంలోకి రాకుండా నిలువరించేందుకు లౌకిక శక్తులతో సిపిఐ ప్రయాణం ఉంటుందని అదేవిధంగా రాష్ట్రంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు ప్రజల పక్షాన పోరాటం ఉంటుందని తెలియజేశారు. అధికారం కోసం సొంత ఏజెండాలకు ప్రాధాన్యత ఇస్తూ బిజెపి ప్రభుత్వం దేశంలో ప్రభుత్వ వ్యవస్థని నిర్వీర్యం చేస్తూ మనుషుల మధ్య మతాల మధ్య చిచ్చు రేపుతుందని విమర్శించారు. యూనియన్ సివిల్ కోడ్ బిల్లు ఇది పూర్తిగా సహేతుకమైనదని ఎవరితో చర్చించకుండా మతాల మధ్య చిచ్చు రేపే విధానాలు మానుకోవాలని బిజెపికి హితవు పలికారు. రాష్ట్రంలో మేధావులపై ఉప చట్టాన్ని ప్రయోగించడం దురదృష్టకరం ఉపా చట్టాన్ని మోపిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని తెలిపారు.

- Advertisement -

ఈ నెల 8 న ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన నేపథ్యంలో సింగరేణి సంస్థ పరిరక్షణ కోసం ఏడవ తేదీన నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేస్తాం. బిజెపి ప్రభుత్వం అవలంబిస్తున్న మతతత్వ విద్వేషాలను ఎప్పటికప్పుడు తిప్పి కొడతామన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కలవేన శంకర్, సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి మేకల దాసు, సిపిఐ పట్టణ కార్యదర్శి ఖాలిందర్ అలి ఖాన్, రాష్ట్ర సమితి సభ్యులు మిట్టపల్లి వెంకటస్వామి, రెగుంట చెంద్రశేకర్, జోగుల మల్లయ్య, కన్నం లక్ష్మి నారాయణ, జిల్లా కార్యవర్గ సభ్యులు మమిడల రాజేశం, ఇప్పకాయల లింగయ్య, భీమనదుని సుదర్శన్, దాగo మల్లేష్, లింగం రవి, జిల్లా సమితి సభ్యులు మిరియాల రాజేశ్వరరావు, దేవి పోచన్న, కుంచాల శంకరయ్య, చాడా మహేందర్ రెడ్డి పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News