పేదలకు ఎల్లప్పుడూ అండగా ఎర్రజెండా ఉంటుందని కొత్తగూడెం మాజీ శాసనసభ్యులు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. కాకరవాయి గ్రామంలో జరిగిన సభకు జిల్లా సమితి సభ్యులు దంతాల బాలరాజు అధ్యక్షత వహించగా ఆ సభకు కూనంనేని సాంబశివరావు ముఖ్య ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ అనునిత్యం పేద ప్రజలకు అండగా ఉండేది కేవలం ఎర్రజెండానేనన్నారు. పేద ప్రజల కోసమే సిపిఐ ఏర్పడిందని 100 సంవత్సరాల సుదీర్ఘకాలంలో ఎన్నో పోరాటాలను నిర్వహించిందని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. తెలంగాణ ప్రాంతంలో సాయిద రైతాంగ పోరాటంతో పాటు అనేక పోరాటాలను నిర్వహించిన చరిత్ర సిపిఐ కి ఉందన్నారు. పేదల సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు చేయడమే తప్ప ఓట్ల కోసం సీట్ల కోసం సిపిఐ ఎప్పుడు చూడలేదు అన్నారు. పేదల సమస్యపై చట్టాలు చేయాలంటే అసెంబ్లీలో కూడా కమ్యూనిస్టులు ఉండాల్సిందేనన్నారు. గతంలో ఎందరో కమ్యూనిస్టులు ప్రజా శ్రేయస్సు కోసం అసెంబ్లీలో పోరాడి అనేక చట్టాలను తీసుకువచ్చారన్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. పేదల పక్షాన పోరాడుతున్నందునే ఏ అధికారం లేకపోయినా పేదలు ఇప్పటికీ ఎర్రజెండాకు అండగా ఉంటున్నారని ఆయన ఈ సందర్భంగా కొనియాడారు. కాకరవాయి గ్రామం కూడా సిపిఐ పార్టీకి పెట్టని కోటగా ఉండేదన్నారు. ఈ గ్రామంలో బండారి పెదరామరెడ్డి, కొత్తపల్లి అబ్బా రాములు, నల్లగట్టు వెంకయ్య, దారావత్ నాగయ్య లాంటి వారు అప్పటి నాయకులు చాలా వెంకటేశ్వరరావు నాయకత్వన ఈ గ్రామంలో ఎన్నో పోరాటాలు చేశారని ఆయన ఈ సందర్భంగా స్మరించుకున్నారు. రాబోయే రోజులలో సామాన్యుల కొరకు సిపిఐ ఆధ్వర్యంలో మరిన్ని పోరాటాలు నిర్వహించనున్నట్లు ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. సిపిఐ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్ మాట్లాడుతూ ఎన్ని కష్టనష్టాలు వచ్చినా ఈ గ్రామం ప్రజలు సిపిఐ ని వదలలేదన్నారు. ఈ గ్రామంలో సిపిఐ లేకుండా చేయాలని ఎందరో ఎన్నో కుట్రలో చేశారని చైతన్యవంతమైన ప్రజలు కుట్రలను తిప్పి కొట్టారన్నారు. ఈ గ్రామాన్ని అభివృద్ధి చెందించడంలో సిపిఐ కీలక పాత్ర పోషించింది అన్నారు. ఈ గ్రామం లోని ప్రతి కుటుంబానికి సిపిఐ పార్టీతో ప్రత్యక్ష, పరోక్ష సంబంధాలు ఉన్నాయన్నారు. ప్రతి చెట్టు చెట్టుకు, పుట్ట పుట్టకు ఈ ప్రాంత అమరవీరుల చరిత్ర గురించి తెలుసన్నారు. ఈ గ్రామానికి సిపిఐ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.
ఈ కార్యక్రమంలో భాగంగా కొత్త బజారు సెంటర్లో ఏర్పాటు చేసిన నూతన జండా ను రాష్ట్ర కంట్రోల్ కమిషన్ చైర్మన్ మహమ్మద్ మౌలానా ఆవిష్కరించగా జిల్లా కార్యవర్గ సభ్యులు జమ్మల జితేందర్ రెడ్డి, తోట రామాంజనేయులు, తిరుమలయపాలెం మండల కార్యదర్శి బత్తుల రాధాకృష్ణ, జిల్లా సమితి సభ్యులు బానోత్ నరసింహ, సీనియర్ నాయకులు కొండా సోమయ్య, ఇంటూరి వెంకటేశ్వర్లు, బండారి పుల్లారెడ్డి, మండల సహాయ కార్యదర్శి చీమ రామకృష్ణ, కాకరవాయి గ్రామ శాఖ కార్యదర్శి భూక్యా శ్రీను, మాజీ ఎంపీటీసీ మహేష్ , నాయకులు దారావత్ రోజా, నల్లగట్ల సరోజ, భూఖ్య వీరాస్వామి తదితరులు పాల్గొన్నారు.