Lankala Deepak Reddy: జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థి విషయంలో ఉత్కంఠకు తెరపడింది. పార్టీ హైకమాండ్ లంకల దీపక్ రెడ్డి పేరును అధికారికంగా ప్రకటించింది. గతంలోనూ జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి దీపక్ రెడ్డి పోటీ చేశారు.
మహిళలు రేసులో ఉన్నప్పటికీ..: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం బీజేపీ తన అభ్యర్థిగా లంకల దీపక్ రెడ్డి పేరును ప్రకటించింది. బీజేపీ తరఫున పోటీ చేసేందుకు పలువురు రేస్‍లో ఉన్నప్పటికీ.. వివిధ సమీకరణాల దృష్ట్యా దీపక్ రెడ్డి పేరును ఖరారు చేసింది. మొదట్లో జూటూరు కీర్తిరెడ్డి, వీరపనేని పద్మ, విక్రమ్ గౌడ్ పేర్లు ప్రముఖంగా వినిపించాయి. కానీ అధిష్టానం మాత్రం లంకల దీపక్ రెడ్డి వైపు మొగ్గు చూపడంతో తన అభిమాను ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుంచి లంకల దీపక్ రెడ్డి పోటీ చేశారు. కానీ మూడో స్థానానికే పరిమితం అయ్యారు. దీంతో అభ్యర్థిని మార్చాలని అనుకున్నప్పటికీ మళ్లీ తనపేరే అధిష్టానం ప్రకటించింది.

Also Read:https://teluguprabha.net/telangana-news/jubilee-hills-election-officer-bans-exit-polls/
బీజేపీ తన అభ్యర్థిగా దీపక్ రెడ్డిని ప్రకటించడంతో మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు ఖరారు పూర్తయిపోయింది. దీంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రసవత్తరంగా సాగనుంది. కాంగ్రెస్ తరపున నవీన్ యాదవ్, బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత ఎన్నికల రంగంలో ఉన్నారు.
మొత్తం 3.98లక్షల మంది ఓటర్లు: జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు ఈ నెల 13వ తేదీన ఈసీ నోటిఫికేషన్ విడుదల చేసింది. అనంతరం నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం అయ్యంది. ఇప్పటికే పలువురు అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. దరఖాస్తుల దాఖలుకు ఈ నెల 21వ తేదీ వరకు అవకాశం ఉంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం 3.98లక్షల మంది ఓటర్లు ఉన్నట్లు ఇప్పటికే ఎన్నికల సంఘం పేర్కొంది.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక షెడ్యూల్:
- నామినేషన్ల స్వీకరణ ప్రారంభం : ఈ నెల 13
- నామినేషన్ల దాఖలు చివరి రోజు : ఈ నెల 21
- నామినేషన్ల పరిశీలన : ఈ నెల 22
- నామినేషన్ల ఉపసంహరణ : ఈ నెల 24
- పోలింగ్ : వచ్చేనెల 11
- కౌంటింగ్ : వచ్చేనెల 14


