బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బిఎన్ రెడ్డి నగర్ డివిజన్ కటికరెడ్డి అరవింద్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎల్బి నగర్ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి బి.యన్.రెడ్డి. నగర్ డివిజన్ పరిధిలోని గాంధీ నగర్, గాంధీ నగర్ సౌత్, సాగర్ కాంప్లెక్స్ ఫేస్ 1, సాగర్ కాంప్లెక్స్ ఫేస్ 2, శ్రీపురం కాలనీ సౌత్, శ్రీపురం నార్త్, గౌతమి నగర్ కాలనీల్లో కాలనీ వాసుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన ఘనత మీదే అని ముక్తకంఠంతో వారంతా తెలిపారు. రాబోయే ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ముద్దగోని రామ్మోహన్ గౌడ్, కుంట్లూరు వెంకటేష్ గౌడ్, మాజీ కార్పొరేటర్ లక్ష్మీ ప్రసన్న, అనిల్ చౌదరి, మాధవరం నర్సింహారావు, సామ బుచ్చిరెడ్డి, గడ్డం మల్లేష్ గౌడ్, సుమన్ గౌడ్, శివశంకర్, పొగుల రాంబాబు, కాజా శ్రీనివాస్ బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, ఉద్యమకారులు, మహిళా నాయకురాలు, అనుబంధ విభాగాల కమిటీ సభ్యులు, కార్యకర్తలు, అభిమానులు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు.