ఎల్.బి.నగర్ నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు బొక్క సదానంద్ రెడ్డి, వారి మిత్ర బృందం ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి వర్యులు కేటీఆర్ సమక్షంలో BRS పార్టీలో చేరారు. వారికి కేటీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు. శాసనసభ్యులు సుధీర్ రెడ్డి నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి పనులకు ఆకార్షితులై తాము పార్టీ మారుతున్నట్టు వివరించారు. దేవిరెడ్డి సుధీర్ రెడ్డి విజయానికి తామంతా ముందుండి గెలుపుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో యువ నాయకులు కార్తిక్ రెడ్డి, ముద్ద పవన్, చందు, మనీష్, హకీమ్, అంజి పాల్గొన్నారు.