హైదరాబాద్ మెట్రో రైల్వే ఛార్జీల(Metro Charges) పెంపుదలకు వ్యతిరేకంగా ఉప్పల్ ఎల్ అండ్ టి మెట్రో డిపో వద్ద వామపక్షాల(Communists)ఆధ్వర్యంలో నిరసన ధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో ఏడు వామపక్ష పార్టీలు పాల్గొన్నాయి. ఛార్జీల పెంపుదలను వెంటనే ఉపసంహరించుకోవాలని వామపక్ష నేతలు డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం మెట్రో సంస్థతో చేసుకున్న ఒప్పందం ప్రకారం ప్రజలపై 50% మించి భారాన్ని మోపరాదన్న నిబంధనను తుంగలో తొక్కారని మండిపడ్డారు. మెట్రో రవాణాకు ప్రజలను దూరం చేసే విధంగా చర్యలు చేపడుతున్నారని ఫైర్ అయ్యారు. తక్షణమే రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకొని పెంచిన మెట్రో రైల్వే ఛార్జీలను ఉపసంహరించాలని.. లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కాగా నేటి నుంచి మెట్రో రైలు ఛార్జీలను పెంచిన సంగతి తెలిసిందే.
Metro Charges: మెట్రో ఛార్జీల పెంపునకు వ్యతిరేకంగా వామపక్షాలు నిరసన
సంబంధిత వార్తలు | RELATED ARTICLES


