Monday, February 3, 2025
HomeతెలంగాణKCR: మాజీ సీఎం కేసీఆర్‌కు లీగల్ నోటీసులు

KCR: మాజీ సీఎం కేసీఆర్‌కు లీగల్ నోటీసులు

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌(KCR)కు బిగ్ షాక్ తగిలింది. ఫెడరేషన్ ఆఫ్ ఫార్మర్స్ అసోసియేషన్ ఇన్ తెలంగాణ లీగల్ కేసీఆర్‌‌కు నోటీసులు పంపింది. ఈమేరకు ఫెడరేషన్ ఆఫ్ ఫార్మర్స్ అసోసియేషన్ ఇన్ తెలంగాణ తరపు న్యాయవాది పాదూరి శ్రీనివాస్ రెడ్డి మెయిల్, స్పీడ్ పోస్ట్ ద్వారా నోటీసులు పంపించారు. శాసనసభలో అపోజిషన్ లీడర్‌గా తన కర్తవ్యాన్ని నిర్వర్తించని కేసీఆర్‌కు సభ్యునిగా కొనసాగే అర్హత లేదని నోటీసులో వెల్లడించారు.

- Advertisement -

ప్రజా సమస్యలపై అసెంబ్లీలో కేసీఆర్‌ పోరాటం చేయాలని లేదంటే అపోజిషన్ లీడర్‌గా తొలగించాలని డిమాండ్‌ చేశారు. కాగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ ప్రతిపక్ష నేతగా ఎన్నికయ్యారు. అయితే కాలుజారి పడటంతో కొంతకాలం విశ్రాంతి తీసుకుంటూ పూర్తిగా ఫాంహౌజ్‌కే పరిమితమయ్యారు. మధ్యలో ఒక్కసారి మాత్రమే ఆయన సభకు హాజరయ్యారు. అసెంబ్లీకి రావాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నా స్పందించడం లేదు. ఈ నేపథ్యంలో తాజాగా ఆయనకు నోటీసులు పంపడం చర్చనీయాంశంగా మారింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News