మందుబాబులకు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వం ఒకేసారి షాక్ ఇచ్చాయి. మద్యం ధరలను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. ఏపీలో మద్యం ధరల(Liquor Rates)ను అక్కడి ప్రభుత్వం పెంచింది. క్వార్టర్ బాటిల్‌పై రూ.10 పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే రూ.99 మద్యం, బీర్ల ధరలను మాత్రం పెంచలేదు. ఇక తెలంగాణ ప్రభుత్వం కూడా బీర్ల ధరలను 15 శాతం పెంచింది. విశ్రాంత న్యాయమూర్తి జైస్వాల్ నేతృత్వంలోని కమిటీ బీర్ల ధరలను 15 శాతం పెంచుతూ సిఫార్సు చేసింది. ఈమేరకు బీర్ల ధరలను 15 శాతం పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
పెరిగిన ధరలు ఈరోజు నుంచే అమల్లోకి వచ్చాయి. ప్రస్తుతం రూ.150గా ఉన్న లైట్ బీర్ ధర రూ. 180కి చేరుకునే అవకాశం ఉంది. అలాగే స్ట్రాంగ్ బీర్ ధర రూ. 160 నుంచి రూ. 190కి పెరగొచ్చు. వేసవి కాలంలో బీర్లకు ఎక్కువ డిమాండ్ ఉండటంతో రాష్ట్ర ఖజానాకు భారీ ఆదాయం సమకూరే అవకాశం ఉంది.