Saturday, November 15, 2025
HomeతెలంగాణLiquor Tenders: రాష్ట్రంలో మద్యం దుకాణాలకు దరఖాస్తుల గడువు పెంపు.. 

Liquor Tenders: రాష్ట్రంలో మద్యం దుకాణాలకు దరఖాస్తుల గడువు పెంపు.. 

Liquor Shops Tenders : రాష్ట్రంలో మద్యం దుకాణాలకు దరఖాస్తుల దాఖలు గడువును పెంచుతూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల 23వ తేదీ వరకు మద్యం దుకాణాలకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతుందని ఎక్సైజ్ శాఖ ప్రకటించింది. ముందస్తు ప్రకటన ప్రకారం శనివారంతో మద్యం దుకాణాల కోసం దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ముగియాల్సి ఉండగా.. బీసీ బంద్, బ్యాంకుల బంద్‌ల కారణంగా దరఖాస్తు చేసుకోలేకపోయామని ఫిర్యాదులు వచ్చాయి. దీంతో ఔత్సాహికుల విజ్ఞప్తి మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎక్సైజ్‌ శాఖ పేర్కొంది.

- Advertisement -

Also Read: https://teluguprabha.net/telangana-news/ktr-sensational-comments-minister-konda-surekha/

అక్టోబర్‌ 23 వరకు తెలంగాణలో మద్యం దుకాణాలకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగనుంది. ఈనెల 27న ఆయా జిల్లాల కలెక్టర్ల సమక్షంలో డ్రా తీసి విజేతలను ప్రకటించనున్నారు. విజేతలకు మద్యం దుకాణాలు కేటాయిస్తారు. కాగా, మద్యం దుకాణాలకు దరఖాస్తు రుసుము రూ. 3లక్షలుగా ప్రభుత్వం నిర్ణయించింది. 

రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2,620 మద్యం దుకాణాలకు సెప్టెంబర్‌ 26 నుంచి దరఖాస్తుల స్వీకరణ చేపట్టారు. గత మద్యం విధానంలో ఒక్కో దరఖాస్తుకు రూ. 2లక్షలుగా రుసుం చెల్లించాల్సి ఉండగా.. నూతన మద్యం పాలసీ ప్రకారం.. రూ. 3 లక్షలు చెల్లించాలి, కాగా, శనివారం సాయంత్రం నాటికి 2,620 మద్యం దుకాణాలకు 85,363 దరఖాస్తులను అధికారులు స్వీకరించారు. కాగా, నిన్న ఒక్కరోజే 38,754 దరఖాస్తులు వచ్చినట్లు ఎక్సైజ్‌ శాఖ తెలిపింది.

Also Read: https://teluguprabha.net/telangana-news/woman-strong-warning-to-pas-of-mps-and-mlas/ 

ఈ నేపథ్యంలో రికార్డులను పరిశీలిస్తే మద్యం షాపులకు గతంలో కంటే ఈ సారి దరఖాస్తులు తగ్గడంతో.. చివరి నిమిషంలో దరఖాస్తు గడువును ఎక్సైజ్‌ శాఖ పొడిగించింది. కాగా, నివేదికల ప్రకారం ఈసారి ఇతర రాష్ట్రాల వ్యాపారులు తెలంగాణలో మద్యం షాపుల నిర్వహణకు ఆసక్తి చూపినట్లు తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఒడిశా వంటి రాష్ట్రాల నుంచి పలువురు దరఖాస్తులు సమర్పించగా.. ఏపీకి చెందిన ఒక మహిళా వ్యాపారి ఏకంగా 150 షాపులకు దరఖాస్తు చేసింది. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad