తెలంగాణలో మందుబాబులకు ప్రభుత్వం శుభవార్త అందించనుంది. ఫ్రూట్ జ్యూస్ తరహాలో మద్యం ప్యాకెట్లు అందించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. 50 రూపాయలకే లిక్కర్ టేట్రా ప్యాకెట్(Liquor Tetra Packet) అందించేలా చర్యలు తీసుకోబోతున్నట్లు సమాచారం. 60, 90, 180ML ఉండేలా ఈ కొత్త మద్యం ప్యాకెట్లు ఉండేలా ప్లాన్ చేస్తోందట. ఇప్పటికే కాంగ్రెస్ పాలిస్తున్న కర్ణాటకలో టెట్రా ప్యాకెట్ మద్యం సేల్ కొనసాగుతోంది. తెలంగాణలో కూడా ఇదే విధానాన్ని తీసుకురావాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.
- Advertisement -
మరోవైపు ఇప్పటికే బీర్ల ధరలను పెంచిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం… త్వరలో లిక్కర్ ధరలను పెంచేందుకు సిద్ధమైంది. లిక్కర్ ధరలపై 10% ధరలు పెంచే అవకాశాలు ఉంది. ఎండాకాలం పూర్తి కాగానే పెంచిన ధరలు అమలులోకి రాబోతున్నట్లు సమాచారం.