Thursday, September 19, 2024
HomeతెలంగాణLiterature day: జూన్ 11న తెలంగాణ సాహిత్య దినోత్సవం

Literature day: జూన్ 11న తెలంగాణ సాహిత్య దినోత్సవం

అన్ని జిల్లాల్లో జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో కవులు, సాహితివేత్తలను గుర్తించి, సత్కరించి, రాష్ట్ర వ్యాప్తంగా కవి సమ్మేళనాలను నిర్వహించాలి

రాష్ట్ర మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ లోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రిక సమావేశంలో తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా జూన్ 11వ తేదీన తెలంగాణ సాహిత్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని తెలంగాణ భాషా – సాంస్కృతిక, సాహిత్య అకాడమీ అధికారులను ఆదేశించారు.

- Advertisement -

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు 9 ఏండ్ల పాలనలో చేపట్టిన అభివృద్ది, సంక్షేమ పథకాలు, సాహిత్య వైభవాన్ని చాటి చెప్పేలా సాహిత్య దినోత్సవాన్ని రాష్ట్ర స్థాయిలో ఘనంగా నిర్వహించాలని మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు.

CM KCR గారి సూచనల మేరకు గంగా జమునా తెహజీబ్ ప్రతిబింబించేలా ఉర్దూ, తెలుగు భాషలలో రాష్ట్రస్థాయి లో 33 జిల్లాల్లో 3 విభాగాలైనా రచనం, పద్యం, ఉర్దూ కవిత్వం లలో కవి సమ్మేళనాలను రాష్ట్రస్థాయిలో రవీంద్ర భారతిలో నిర్వహించి ఎంపికైన ఉత్తమ కవితలకు మొదటి బహుమతిగా 1 లక్ష 116 రూపాయల ను, రెండవ బహుమతిగా 75 వేల 116 రూపాయలను, మూడోవ బహుమతిగా 60 వేల 116 రూపాయలను, చతుర్థ బహుమతి గా 50 వేల 116 రూపాయలు, పంచమ బహుమతిగా 30 వేల 116 రూపాయలు బహుమతిగా అందించి కవులను, సాహితి వేత్తల ను ప్రోత్సహించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. రాష్ట్రస్థాయిలో ఎంపికైన ఉత్తమ కవితలను కలిపి పుస్తక రూపంగా తీసుకురావాలని మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అధికారులను ఆదేశించారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 4 అకాడమీలను ఏర్పాటు చేసి ఆయా రంగాలలో విశేష కృషి చేస్తున్న వారిని గుర్తించి వారి అభిరుచులకు అనుగుణంగా ఆయా బాధ్యతలను సీఎం కేసీఆర్ అప్పగించారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు గత తెలంగాణ సీఎం కేసీఆర్ నేతృత్వంలో నేటి తెలంగాణకు గల వ్యత్యాసాలను, జరిగిన అభివృద్ధిని ,ప్రజలకు అందుతున్న సంక్షేమాన్ని, వ్యవసాయం, పరిశ్రమలు, పట్టణాల అభివృద్ధి, గ్రామీణ అభివృద్ధి, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, విద్య, వైద్య రంగాలలో జరిగిన అభివృద్ధి, విద్యుత్, సాగునీటి, త్రాగునీటి, సాంస్కృతిక, పర్యాటకంగా, క్రీడలపరంగా జరిగిన అభివృద్ధిలపై కవులు, సాహితి వేత్తలు తమ రచనలను కొనసాగించాలని మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్ ఈ సందర్భంగా కోరారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ తెలంగాణ సాహిత్య వేదికను ఏర్పాటు చేసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ ప్రాంతానికి చెందిన కవులను తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, తెలంగాణ సాహిత్య అకాడమీల ఆధ్వర్యంలో ఐక్యం చేసి ప్రపంచ తెలుగు మహాసభలను ఘనంగా నిర్వహించి రాష్ట్రానికి వన్నెతెచ్చిన గొప్ప సాహిత్య అభిమాని, స్వయాన కవి అయిన సీఎం కేసీఆర్ కి ఘనత దక్కిందన్నారు.

రాష్ట్రం ఏర్పడిన తర్వాత దాశరథి, కాళోజి గార్ల పేరిట రాష్ట్రస్థాయి అవార్డులను కవులకు, సాహితివేత్తలకు, కళాకారులకు అందిస్తున్నామన్నారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన వైతాళికులను, కవులను, కళాకారులను, సామాజిక వేత్తలను గుర్తించి వారి జయంతి వర్ధంతిలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నామన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో కవులు లేరని తెలంగాణ భాష యాస అని విమర్శలు చేసినప్పుడు గోల్కొండ పత్రిక సంపాదకులు సురవరం ప్రతాపరెడ్డి తన పత్రికలో తెలంగాణ ప్రాంతంలో ఉన్న సుమారు 350 మంది కవుల వివరాలు, వారు రచించిన రచనలు ప్రచురించారన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ సాహిత్య దినోత్సవాన్ని జూన్ 11వ తేదీన అన్ని జిల్లాల్లో జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో కవులను సాహితివేత్తలను గుర్తించి వారిని సత్కరించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కవి సమ్మేళనాలను నిర్వహించాలని తెలంగాణ సాహిత్య వైభవాన్ని దశ దిశల చాటాలని మంత్రి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈనెల 11వ తేదీన రాష్ట్ర స్థాయి సాహిత్య దినోత్సవం హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. ఈ సాహిత్య దినోత్సవం లో కవులు, సాహితివేత్తలు ఇదే ఆహ్వానంగా భావించి తెలంగాణ సాహిత్య దినోత్సవం లో పాల్గొనాలని మంత్రి ఈ సందర్భంగా కోరారు.

ఈ పత్రికా సమావేశంలో రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్, రాష్ట్ర సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, సాహిత్య అకాడమీ కార్యదర్శి బాలా చారి, ఇతర అదికారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News