Telangana liquor lottery: వైన్స్ టెండర్ల లక్కీ లాటరీలో ఓ వ్యక్తికి పంటపండింది. అదృష్టం వరించి ఏకంగా.. మూడు షాపులు దక్కించుకున్నాడు. దీంతో అతని సంతోషానికి అవదులు లేకుండా ఉబ్బితబ్బిపోయాడు.
ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన వైన్స్ టెండర్ల లక్కీ లాటరీలో సంగారెడ్డికి చెందిన వ్యక్తికి అదృష్టం వరించింది. ఒక్కడికే 3 మద్యం షాపులు దక్కాయి. దీంతో అతడు హ్యాట్రిక్ కొట్టాడు. సంగారెడ్డి పట్టణానికి చెందిన రాజేశ్వర్ గౌడ్.. మొత్తం 24 షాపులకు టెండర్లు వేశారు. జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఆధ్వర్యంలో సంగారెడ్డి జెఎస్ఆర్ గార్డెన్‌లో నిర్వహించిన ఎక్సైజ్ శాఖ లక్కీ లాటరీలో రాజేశ్వర్ గౌడ్‌కు మూడు షాపులు దక్కాయి. షాప్ నెంబర్ 1, 3, 8 లాటరీ ద్వారా దక్కాయి. అయితే అతను సిండికేట్‌గా సంగారెడ్డిలోని అన్ని షాపులకు కలిపి దాదాపు 100 వరకు దరఖాస్తులు చేసుకున్నారు. అందులో ఏకంగా మూడు షాపులు రాజేశ్వర్‌కి దక్కాయి. దీంతో అతను సంతోషంతో ఉబ్బితబ్బిపోయాడు.
Also Read:https://teluguprabha.net/telangana-news/telangana-liquor-shop-license-lottery-2025/
దరఖాస్తుల వెల్లువ.. పోటీ తీవ్రం: రాష్ట్రంలోని 2,620 మద్యం దుకాణాలకు గాను ఏకంగా 95,137 దరఖాస్తులు రావడం ఈ వ్యాపారంపై ఉన్న ఆసక్తికి నిలువుటద్దం పడుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో పోటీ తీవ్రంగా ఉంది. శంషాబాద్ ఎక్సైజ్ జిల్లా పరిధిలోని 100 దుకాణాలకు ఏకంగా 8,536 దరఖాస్తులు వచ్చాయి. అంటే ఒక్కో దుకాణానికి సగటున 85 మందికి పైగా పోటీ పడుతున్నారు. తర్వాతి స్థానాల్లో.. సరూర్‌నగర్‌లో 134 దుకాణాలకు 7,845, మేడ్చల్‌లో 114 దుకాణాలకు 6,063, మల్కాజిగిరిలో 88 దుకాణాలకు 5,168 చొప్పున దరఖాస్తులు దాఖలయ్యాయి. అత్యల్పంగా కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 32 దుకాణాలకు కేవలం 680 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. ప్రస్తుతం ఆయా జిల్లాల కలెక్టర్ల సమక్షంలో పారదర్శకంగా లాటరీ ప్రక్రియ ప్రారంభమైంది.


