Saturday, November 15, 2025
HomeతెలంగాణLiquor Lottery: ఒక్క మహిళ.. రెండు మద్యం దుకాణాలు.. అదృష్టం అంటే ఆమెదే!

Liquor Lottery: ఒక్క మహిళ.. రెండు మద్యం దుకాణాలు.. అదృష్టం అంటే ఆమెదే!

Lucky woman two liquor shops win: నిన్నటి దాకా ఆమె ఓ సాధారణ మహిళ. నేడు లక్కీ మహిళ. వైన్స్ టెండర్ల లక్కీ లాటరీలో ఓ మహిళకు అదృష్టం తలుపు తట్టింది. ఏకంగా.. రెండు షాపులు దక్కించుకున్నాడు. ఇందులో విశేషం ఏముంది అంటారా.. తాను కేవలం రెండు దరఖాస్తు మాత్రమే చేసుకుంది. అయితే ఆ రెండింటిలో ఆమెకు మద్యం దుకాణాలు దక్కాయి. దీంతో స్థానికులు ఆమెను లక్కీ లేడీ అంటూ అభినందించారు.

- Advertisement -

లక్కీ మహిళ: తెలంగాణ వ్యాప్తంగా ఎంతో మంది అశావాహులు టెండర్లు దక్కించుకునేందుకు నువ్వానేనా అన్నట్లుగా పోటీపడ్డారు. అయితే.. ఓ మహిళ ఏకంగా రెండు వైన్ షాపులను దక్కించుకుని లక్కీ మహిళగా నిలిచింది. నిర్మల్ జిల్లా కేంద్రంలో నివాసం ఉంటున్న గుర్రాల హారిక లక్ష్మణ చందా అనే మహిళ పొనకల్ గ్రామాల్లో రెండు మద్యం దుకాణాలకు టెండర్లు వేసింది. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆధ్వర్యంలో లక్కీ డ్రా పద్ధతిలో లాటరీ తీయడంతో.. ఆమెకు అదృష్టం తలుపు తట్టింది. ఏకంగా ఆ మహిల రెండు షాపులు దక్కించుకున్నది. దీంతో స్థానికులు ఆమెను లక్కీ మహిళ అంటూ అభినందించారు. మద్యం వ్యాపారంలో నిన్నటివరకు ఆమెకు ఎలాంటి అనుభవం లేదు. కానీ రెండు వైన్ షాపులు రావడంతో ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

Also Read:https://teluguprabha.net/telangana-news/lucky-person-three-liquor-shops-in-wine-tenders-lottery/

మరో వ్యక్తి హ్యాట్రిక్ కొట్టాడు: ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన వైన్స్ టెండర్ల లక్కీ లాటరీలో సంగారెడ్డికి చెందిన వ్యక్తికి అదృష్టం వరించింది. ఒక్కడికే 3 మద్యం షాపులు దక్కాయి. దీంతో అతడు హ్యాట్రిక్ కొట్టాడు. సంగారెడ్డి పట్టణానికి చెందిన రాజేశ్వర్ గౌడ్.. మొత్తం 24 షాపులకు టెండర్లు వేశారు. జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఆధ్వర్యంలో సంగారెడ్డి జెఎస్ఆర్ గార్డెన్‌లో నిర్వహించిన ఎక్సైజ్ శాఖ లక్కీ లాటరీలో రాజేశ్వర్ గౌడ్‌కు మూడు షాపులు దక్కాయి. షాప్ నెంబర్ 1, 3, 8 లాటరీ ద్వారా దక్కాయి. అయితే అతను సిండికేట్‌గా సంగారెడ్డిలోని అన్ని షాపులకు కలిపి దాదాపు 100 వరకు దరఖాస్తులు చేసుకున్నారు. అందులో ఏకంగా మూడు షాపులు రాజేశ్వర్‌కి దక్కాయి. దీంతో అతను సంతోషంతో ఉబ్బితబ్బిపోయాడు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad