Friday, April 4, 2025
HomeతెలంగాణEturnagaram | ఏటూరు నాగారం ఎన్కౌంటర్ పై హైకోర్టులో పిటిషన్

Eturnagaram | ఏటూరు నాగారం ఎన్కౌంటర్ పై హైకోర్టులో పిటిషన్

ములుగు జిల్లా ఏటూరు నాగారం (Eturnagaram) మండలం ఏజెన్సీ అడవుల్లో ఆదివారం భారీ ఎన్కౌంటర్ జరిగింది. పీపుల్స్‌ లిబరేషన్‌ గెరిల్లా ఆర్మీ (పీఎల్‌జీఏ) వారోత్సవాలకు ఒకరోజు ముందు జరిగిన ఈ కాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఎన్కౌంటర్ పై తెలంగాణ మానవహక్కుల సంఘం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది.

- Advertisement -

ఎంకౌంటర్ లో మరణించిన మావోయిస్టుల మృతదేహాలకు వైద్య నిపుణుల సమక్షంలో పోస్టుమార్టం జరపాలని పిటిషన్లో పేర్కొన్నారు. పోస్టుమార్టం సమయంలో వీడియో రికార్డ్ చేయాలని కోరారు. కాగా, ఎన్కౌంటర్లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందిన మృతదేహాలకు ఏటూరునాగారం (Eturnagaram) ఆసుపత్రిలో పోస్టుమార్టం చేయనున్నారు. వరంగల్ నుంచి వచ్చిన 13 మంది వైద్యులు, ఫోరెన్సిక్ నిపుణుల ఆధ్వర్యంలో పోస్టుమార్టం జరగనున్నాయి. దీంతో ఆసుపత్రి పరిసరాల్లో అధికారులు కట్టుదిట్టమైన భ్రదత ఏర్పాట్లు చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News