Monday, December 15, 2025
HomeతెలంగాణCM Revanth Reddy: తెలంగాణ తల్లి విగ్రహం పనులు పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy: తెలంగాణ తల్లి విగ్రహం పనులు పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy| రాష్ట్ర సచివాలయంలో ఏర్పాటు చేయనున్న తెలంగాణ తల్లి(Telangana Thalli) విగ్రహం పనులను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. నాయకులు, అధికారులకు సమాచారం ఇవ్వకుండా నేరుగా విగ్రహం తయారవుతున్న చోటుకు వెళ్లారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అబ్దుల్లాపూర్ మెట్‌ ఔటర్ రింగు రోడ్డు దగ్గర తయారు చేస్తున్న తెలంగాణ తల్లి విగ్రహ పనులను పరిశీలించారు. విగ్రహం తయారీ పనులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం విగ్రహం తుది మెరుగులపై పలు సూచనలు చేసినట్లు సమాచారం. ఈ సందర్భంగా సీఎం వెంట ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి ఉన్నారు.

- Advertisement -

కాగా డిసెంబర్ 9న సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహన్ని సీఎం రేవంత్‌రెడ్డి ఆవిష్కరించనున్నారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభం ప్రకటన.. కాంగ్రెస్ అగ్రనేత, సోనియాగాంధీ పుట్టినరోజు కావడం.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ఆరోజు తెలంగాణ తల్లి ఉత్సవాలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News