Monday, April 7, 2025
HomeతెలంగాణMadhavaram Krishanarao: కేటీఆర్ పుట్టినరోజు 2,000 మందికి చీరలు, వీల్ ఛైర్స్ పంపిణీ చేసిన...

Madhavaram Krishanarao: కేటీఆర్ పుట్టినరోజు 2,000 మందికి చీరలు, వీల్ ఛైర్స్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే

కేటీఆర్ సీఎం అవ్వాలి-మాధవరం కృష్ణారావు

కూకట్ పల్లి నియోజకవర్గం ఓల్డ్ బోయిన్ పల్లిలో ఘనంగా బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని కేక్ కట్ చేసి 2,000 మంది మహిళలకు చీరలు, వికలాంగులకు వీల్ చైర్ల పంపిణీ చేశారు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కార్పొరేటర్ ముద్దం నర్సింహ యాదవ్.

- Advertisement -

దేశంలో ఎక్కడలేని విధంగా ఐటి కంపెనీలను తెలంగాణకు తీసుకువచ్చి ఐటిలో దేశంలోనే తెలంగాణరాష్ట్రంను ముందంజలో ఉంచిన నాయకుడు మంత్రి కేటీఆర్ – ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. దేశ రాజకీయాలలో కేసీఅర్ కీలక పాత్ర పోషించాలని, రాబోయే ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేటీఆర్ అవ్వాలని కోరుకుంటున్నామని ఎమ్మెల్యే కృష్ణారావు ఈ సందర్భంగా అన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News