కూకట్పల్లి నియోజకవర్గంలోని కె.పి.హెచ్.బి కాలనీ ఫతేనగర్ డివిజన్లో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ కోటి రూపాయలతో శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొమ్మిది సంవత్సరాలలో కూకట్పల్లి నియోజకవర్గంలో మంచినీటి సమస్యను పరిష్కరించామని, దానితో పాటుగా రోడ్లు డ్రైనేజీ వ్యవస్థకు శాశ్వత పరిష్కారం చేశామని నియోజకవర్గంలో దాదాపు 90 శాతం పనులు పూర్తి చేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు పండాల సతీష్ గౌడ్, మందాడి శ్రీనివాసరావు .. ఈఈ సత్యనారాయణ.. డిఈ ఆనంద్ . ఏఈ శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు..
Madhavaram Krishnarao: కూకట్పల్లిలో 90% పనులు పూర్తి
మంచినీటి సమస్యను పరిష్కరించాం
సంబంధిత వార్తలు | RELATED ARTICLES


