కూకట్ పల్లి నియోజకవర్గంలో అల్లపూర్ డివిజన్ ను వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశామని ఏ పార్టీలు చేయని అభివృద్ధిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసి చూపెట్టిందనీ ఎమ్మేల్యే మాధవరం కృష్ణారావు అన్నారు.
అల్లపూర్ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ సబిహా గౌసుద్దీన్ తో కలిసి 30వ రోజు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పాదయాత్ర చేశారు. పలు కాలనీలో తిరుగుతూ ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. అదేవిధంగా లోతట్టు ప్రాంతాలలో ఉన్న కాలనీలను పరిశీలించి వాటిపై సత్వరమే పరిష్కారం చేయాలని అధికారులకు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డాక కూకట్పల్లి నియోజకవర్గంలో 500 కోట్ల రూపాయలతో నాలా వ్యవస్థ డ్రైనేజీ వ్యవస్థను పూర్తి చేశామని అందువల్ల నియోజకవర్గంలోని లోతట్టు ప్రాంతాలలో 50% లోతట్టు ప్రాంతాలలో ఉన్న కాలనీలో నీళ్లు ఉండకుండా రిటర్నింగ్ వాళ్ళు సైతం ఏర్పాటు చేశామన్నారు.
56 కోట్ల రూపాయలతో అల్లాపూర్ ఫతేనగర్ డివిజన్లలో రిటర్నింగ్ వాళ్ళ నిర్మాణం డ్రైనేజీ వ్యవస్థను నిర్మిస్తామని వచ్చే సంవత్సరం మార్చి వరకు 100 శాతం పనులు పూర్తి చేస్తామని ఎమ్మేల్యే అన్నారు. వర్షాలు వచ్చినప్పుడు రాజకీయం చేయడం తప్ప బీజేపీ కాంగ్రెస్ పార్టీలో ప్రజలకు చేసేది ఏమీ లేదని మాయమాటల్లో ప్రజలను మభ్యపెట్టడం తప్ప ఏమీ చేయలేదని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు.