Thursday, April 10, 2025
HomeతెలంగాణMadhavaram Krishnarao: దవాఖానాలు పరిశీలించిన ఎమ్మెల్యే

Madhavaram Krishnarao: దవాఖానాలు పరిశీలించిన ఎమ్మెల్యే

మానవతా దృక్పథంతో బస్తీ దవాఖానాలు

కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు బోయిన్పల్లి డివిజన్ లోని అన్ని ప్రాంతాల్లోని బస్తీ దవాఖానాలను పరిశీలించారు… అన్నిచోట్ల మౌలిక సదుపాయాలకి సంబంధించి వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు… వార్డ్ ఆఫీస్ లో ఉన్న బస్తీ దవాఖాన మొదటి అంతస్తులో ఉన్న కారణంగా గర్భిణులు, వృద్ధులు ఇబ్బంది పడుతున్న విషయాన్ని వైద్యులు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు దృష్టికి తీసుకు వచ్చారు.. దీంతో వెంటనే మొదటి అంతస్తు నుంచి కిందికి మార్చాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.. అనంతరం.. అస్మత్ పేట… అంజయ్య నగర్… శాంతినికేతన్ కాలనీ బస్తీ దవాఖానాలను పరిశీలించి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని మౌలిక సదుపాయాలు, మందులు విషయంలో ఇబ్బంది ఉన్నయెడల తెలియజేయాలని వైద్యులకు తెలిపారు.

- Advertisement -

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రజలందరికీ మరీ ముఖ్యంగా నిరుపేదలకు వైద్యం అందాలనే ఉద్దేశంతో మానవతా దృక్పథంతో ఈ బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేశారని ..నేడు నిరుపేదలు చమటోడ్చి పని చేసుకుని ఎప్పుడైనా అస్వస్థత కు గురైన వెంటనే అందుబాటులో ఈ బస్తీ దవాఖానాలు అందుబాటు లో ఉన్నాయి అని తెలిపారు…అనంతరం ప్రపంచ వైద్యుల దినోత్సవం సందర్భంగా డాక్టర్స్ ను సన్మానించారు…ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ముద్దమ్ నరసింహ యాదవ్ డాక్టర్ చందర్..జనరల్ సెక్రెటరీ హరినాథ్…మక్కాల నరసింగరావు..వైద్యులు అధికారులు పాల్గొన్నారు…

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News