Sunday, November 16, 2025
HomeతెలంగాణMadhavaram: అభివృద్ధి పనుల్లో కూకట్పల్లి ఎమ్మెల్యే

Madhavaram: అభివృద్ధి పనుల్లో కూకట్పల్లి ఎమ్మెల్యే

కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అల్లాపూర్ డివిజన్లోని వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇందులో భాగంగా పర్వతనగర్ లోని ముస్లిమ్స్ స్మశాన వాటికను, రామారావునగర్ లోని హిందూ స్మశాన వాటికను  ప్రారంభించారు.  అనంతరం సెంటర్ అల్లాపూర్ మసీదును పరిశీలించి మౌలిక సదుపాయాలుకు ఇబ్బంది ఉంటే తెలపాలని, ఇక్కడికి వచ్చే ముస్లిం సోదరులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అనంతరం రామారావు నగర్, కబీర్ నగర్ నాలా  పనులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ.. వందల కోట్ల రూపాయలతో అల్లాపూర్ డివిజన్ ను అన్ని విధాలుగా అభివృద్ధి చేశామని ఎక్కడికక్కడ రోడ్లు, మంచినీరు, విద్యుత్, కమ్యూనిటీ హాల్ ల నిర్మాణం వంటి ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు పూర్తి చేశామన్నారు.  ఒకప్పుడు ఈ ప్రాంతం ఎంతో అస్తవ్యస్తంగా ఉండేదని, నేడు అల్లాపూర్ ప్రాంతం అన్ని వర్గాల ప్రజలు నివసించడానికి చుట్టుపక్కల ప్రాంతాలైన హైటెక్ సిటీ కూకట్పల్లి ఎక్కడికి వెళ్లాలన్నా ప్రధాన కేంద్రంగా మారిందన్నారు. ఇందుకు కావాల్సిన రోడ్లు, ఫ్లైఓవర్లు అండర్పాస్ బ్రిడ్జిలు కూడా పూర్తి చేశామన్నారు. అక్కడక్కడ ఉన్న నాలా సమస్యలను కూడా త్వరలోనే పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సబియా గౌసుద్దీన్.. మేడ్చల్ జిల్లా మైనార్టీ అధ్యక్షులు మహమ్మద్ గౌసుద్దీన్.. డివిజన్ అధ్యక్షులు ఐలయ్య నాయకులు కార్యకర్తలు అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -


సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad