మధిర ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదంతో చట్టసభల్లో ప్రజా సమస్యలపై పోరాటం చేసిన నాయకుడు మల్లు భట్టి విక్రమార్క అని మరోమారు ఆయనకు మద్దతుగా నిలిచి గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విక్రమార్క సతీమణి మల్లు నందిని ప్రజలను కోరారు. మధిర మున్సిపాలిటీ పరిధిలోని 18 వ వార్డులో ఆయన ఇంటింటి ప్రచారాన్ని స్థానిక నాయకులు కార్యకర్తలతో కలిసి నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ హాయంలో మధిర నియోజకవర్గం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిన ఆయన సుమారు 18 వేల కోట్లతో అభివృద్ధి చేసిన విషయం ప్రస్తావించిన ఆమె ఈ క్రమంలోనే మున్సిపాలిటీగా అప్డేట్ చేసి భవిష్యత్ అభివృద్ధి లక్ష్యాల సాధన కోసం కృషి చేశారన్నారు. రాష్ట్రంలో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలుస్తున్నారని మరి నియోజకవర్గంలో మరో మారు భట్టి విక్రమార్కకు అవకాశం కల్పిస్తే మధిర పట్టణంతోపాటు నియోజకవర్గం జిల్లా సమగ్ర అభివృద్ధికి లక్ష్యంతో కూడిన ప్రణాళికతో భట్టి విక్రమార్క కృషి చేస్తారని నందిని ప్రజలకు వివరించారు.
అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమని మల్లు నందిని విక్రమార్క అన్నారు. ఇందిరమ్మ రాజ్యం రావాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని, భట్టి విక్రమార్క ఎన్నికల గుర్తు హస్తం గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని ..ఇంటింటికి తిరుగుతూ 6 గ్యారంటీ హామీ పత్రాలను ప్రజలకు అందజేశారు.