పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 21న ఖమ్మంలోని SBIT ఇంజనీరింగ్ కాలేజ్ అవరణలో నిర్వహించే ‘మెగా జాబ్ మేళా’ను నిరుద్యోగ యువతీ యువకులు సద్వినియోగం చేసుకొవాలని పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ విజ్ఞప్తి చేశారు. వార్షిక తనిఖీలలో భాగంగా ఈరోజు మధిర టౌన్,బోనకల్లు పోలీస్ స్టేషన్లను సందర్శించిన పోలీస్ కమిషనర్ ముందుగా పోలీస్ సిబ్బంది నుండి గౌరవ వందనం స్వీకరించారు. ఆనంతరం మెగా జాబ్ మేళా పోస్టర్లను అవిష్కారించారు. పోలీస్ స్టేషన్ పరిసరాలు, స్టేషన్ నిర్వహణ, పోలీసుల పనితీరు, రికార్డులు, కేసుల వివరాలు, శాంతి భద్రతలు, 14 ఫంక్షనల్ వర్టికల్స్ పనివిధానాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ.. పోలీస్ స్టేషన్ కి వచ్చే వారి పట్ల వివక్ష చూపకుండా అందరికీ సమానంగా న్యాయం అందేలా చూడాలన్నారు. బాధితుల గౌరవం భంగం కలగకుండా మెరుగైన సేవలను అందించేందుకు కృషి చేయాలన్నారు. పోలీస్ స్టేషన్ లలో రికార్డులను ఏవిధంగా భద్రపరుచుకోవాలి, స్టేషన్ పరిసరాలను ఏ విదంగా పరిశుభ్రపరుచుకోవాలి, కానిస్టేబుల్స్ విధుల పట్ల ఏ విదంగా బాధ్యతయుతంగా ఉండాలి, అనే అంశాలపై తగు సూచనలు చేశారు. కార్యక్రమంలో ట్రైనీ ఐపిఎస్ అవినాష్ కుమార్ , వైరా ఏసీపీ రహెమాన్, సిఐ మురళీ పాల్గొన్నారు.