Friday, November 22, 2024
HomeతెలంగాణMadhira: ఎర్రుపాలెం పోలీస్ స్టేషన్ సందర్శన

Madhira: ఎర్రుపాలెం పోలీస్ స్టేషన్ సందర్శన

వైరా డివిజన్ పరిధిలోని ఎర్రుపాలెం పోలీస్ స్టేషన్ ను పోలీస్ కమిషనర్ విష్ణు యస్ వారియర్ సందర్శించారు. ఇందులో భాగంగా పునరుద్ధరించిన పోలీస్ స్టేషన్ను, నూతనంగా నిర్మించిన పార్కింగ్ షెడ్ ను ప్రారంభించారు సీపీ.సందర్శించారు. ఎర్రుపాలెం పోలీస్ స్టేషన్ కు చేరుకున్న పోలీస్ కమిషనర్ స్టేషన్ నిర్వహణ, పోలీసుల పనితీరు, పరిసరాలు, రికార్డులను పరిశీలించారు. శాంతి భద్రతలు, నేరాల నియంత్రణకు పోలీసులు తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకొని తగిన సూచనలు చేశారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ.. ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని, శాంతి భద్రతల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యతను ఇవ్వాలన్నారు. కేసుల నమోదు విషయంలో తత్సారం చేయవద్దన్నారు. అదేవిధంగా విధి నిర్వహణలో రోల్ క్లారిటీ వుండాలని, అప్పగించిన భాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తూ, పోలీసు వ్యవస్థపై మరింత నమ్మకాన్ని పెంచాలన్నారు.
5s అమలులో భాగంగా పోలీస్ స్టేషన్లలో స్టేషనరీ విభాగం పరిశుభ్రంగా వుంచాలని అదేవిధంగా అవసరమైన రికార్డులు, వస్తువుల క్రమపద్ధతిలో పెట్టడం, పరిసరాలలో సురక్షితమైన, ఆరోగ్యవంతమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోవాలన్నారు. స్టేషన్ హౌస్ మేనేజ్‌మెంట్, పోలీస్ స్టేషన్ నిర్వహణ, రెగ్యులర్ రోల్ కాల్ మరియు వీక్లీ పరేడ్ గురించి సిబ్బంది అధికారులు విధిగా అమలు చేయాలని సూచించారు. పెట్రో కార్, బీట్ డ్యూటీ సిబ్బంది ఏవిధమైన విధులు నిర్వహిస్తున్నారు? పాత నేరస్ధుల నివాసాలను కదలికలను ఏవిధంగా గుర్తిస్తున్నారో అడిగి తెలుసుకున్నారు.
కమ్యూనిటీ పోలిసింగ్ లో భాగంగా సీసీ కెమెరాల ఏర్పాటు చేయడం ద్వారా కలిగే ఉపయోగాలను స్ధానికులు వివరించి స్వచ్ఛందంగా సీసీ కెమెరాలు పెట్టుకొనే విధంగా అవగాహన కల్పించాలని సూచించారు. పునరుద్ధరించబడిన ఎర్రుపాలెం పోలీస్ స్టేషన్ ను ఎర్రుపాలెం పోలీస్ స్టేషన్, నూతనంగా నిర్మించిన పార్కింగ్ షేడ్, ప్రహరీ గోడను పోలీస్ కమిషనర్ ప్రారంభించారు. శిధిలావస్థలో వున్న ఎర్రుపాలెం పోలీస్ స్టేషన్ ను మరమ్మత్తులు చేయాలని ఇటీవల పోలీస్ కమిషనర్ ఆదేశించడంతో అధునిక సౌకర్యాన్ని జోడించి మరమ్మత్తులు చేపట్టారు. కార్యక్రమంలో ఏసిపీ రహెమాన్ మధిర సిఐ మురళి ఎస్సై పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News