Saturday, January 4, 2025
HomeతెలంగాణMadhusudhana Chary: సీఎం రేవంత్ రెడ్డికి మధుసూదనాచారి బహిరంగ లేఖ

Madhusudhana Chary: సీఎం రేవంత్ రెడ్డికి మధుసూదనాచారి బహిరంగ లేఖ

దివంగత ప్రధాని మన్మోహన్ సింగ్(Manmohan Singh) మృతికి సంతాపం తెలిపే అవకాశం తెలంగాణ శాసనమండలికి ఇవ్వకపోవడంపై సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కి మండలి ప్రతిపక్ష నాయకుడు మధుసుదనాచారి(Madhusudhana Chary)బహిరంగ లేఖ రాశారు. శాసన మండలిపై చిన్న చూపు తగదని లేఖలో పేర్కొన్నారు. ఆర్థిక సంస్కరణలతో భారత ఆర్థిక ప్రగతి శిలను శిల్పంగా చెక్కి ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న మన్మోహన్‌ సింగ్‌కు గౌరవమైన సంతాపం తెలిపే అవకాశం మండలికి కలిగించకపోవడం విచారకరమని తెలిపారు.

- Advertisement -

దేశంలోనే ఎగువ సభ అయిన రాజ్యసభకు అనేక పర్యాయాలు ప్రాతినిధ్యం వహించిన మహానుభావుడికి రాష్ట్రంలోని ఎగువ సభలో సంతాపం తెలియజేయడం సముచితమని అన్నారు. కానీ అలా చేయకపోవడాన్ని మండలి హృదయ వేదనగా పరిగణించాలని చెప్పారు. రాష్ట్రంలోని ఎగువసభపై చిన్నచూపు, చులకన భావన తగదని.. భవిష్యత్తులోనైనా ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని సూచించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News