పాలకుర్తి నియోజకవర్గం మహబూబాబాద్ జిల్లా, తొర్రూరు పట్టణంలో పునరుద్ధరించిన అశ్విని సినిమా థియేటర్ ను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పునః ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి జయం మనదే సినిమాను కొద్దిసేపు వీక్షించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ సినిమాను థియేటర్ లలో చూస్తే వచ్చే ఆనందమే వేరు అన్నారు. జనం సినిమాలను థియేటర్ లలోనే చూడాలన్నారు.