Sunday, July 7, 2024
HomeతెలంగాణMahabubabad: దొరవారి తిమ్మాపురంను సందర్శించిన ఎమ్మెల్యే

Mahabubabad: దొరవారి తిమ్మాపురంను సందర్శించిన ఎమ్మెల్యే

నిజమైన దొర అంటే ఎమ్మేల్యే శంకర్ నాయక్ అంటున్న గూడెం ప్రజలు

ఆ గిరిజన గుడానికి పోవాలంటే మొదలు కారులో వెళ్ళాలి, ఆ తర్వాత బైక్ పై వెళ్ళాలి, ఆ తర్వాత ట్రాక్టర్ పై, ఆ తర్వాత వాగులు ఈదుకుంటూ, పుట్టలు చెట్లు దాటుకుంటూ నడిచి వెళ్ళాలి, ఆ గ్రామమే దొరవారితిమ్మాపురం. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండి చరిత్రలో ఏ పాలకుడు కూడా కన్నెత్తి చూడని ఆ గిరిజన గుడెంకి వెళ్లి వారికి నేనున్నానంటూ భరోసా నింపిన మహబూబాబాద్ శాసన సభ్యులు బానోత్ శంకర్ నాయక్.

- Advertisement -

మహబూబాబాద్ జిల్లా, గూడూరు మండలం మట్టేవాడ గ్రామ సరిహద్దును అనుకోని కొండ కొనల మధ్య ఒక గూడెం ఉన్నది, అదే దొరవారి తిమ్మాపురం. ఈ గూడెంలో కేవలం 25 ఇండ్లు మాత్రమే ఉంటాయి. వీరి జీవన విధానం అంత ప్రకృతి పైననే, అమాయక కోయ జాతికి చెందిన ప్రజలు ఒక ఆరుతడి పంటను పండిస్తూ వీరి ప్రధాన వనరుగా జీవణం సాగిస్తుంటారు. దాదాపు వీరికి సరిహద్దు గ్రామాలతో సంబంధాలు ఉండాలంటే దాదాపు 10 కిలోమీటర్ల పరిధి. గూడెంలో ఉన్న వ్యక్తికి ఏ కష్టం వచ్చిన ఆరోగ్య సమస్య వచ్చినా ఎదన్న ప్రమాదం జరిగిన అక్కడకు పోయే లోపే ప్రాణాలు పోతాయి. ఈ గూడెం లో నివసించే వారికి బయటి ప్రజలు పెళ్లి సంబంధాల కు కూడా ముందుకు రారంటే పరిస్థితి ఎంత దుర్భరంగా ఉంటుందో ఆలోచించాలి. ఇలాంటి కోయ గుడానికి సోమవారం పార్టీ కార్యకర్తలతో ఎమ్మేల్యే శంకర్ నాయక్ వెళ్లారు. అష్ట కష్టాలు పడి ఉదయము తన ప్రయాణాన్ని మొదలు పెడితే అక్కడికి చేరుకునే లోపు మధ్యాహ్నం దాటింది. వారి అభిప్రాయాలు పంచుకొనీ ఇంటింటికీ తిరిగి వారి జీవన శైలిని పరిశీలించి వారితో కలిసి నేలపై కూర్చొని భోజనం చేశారు. ఒక వృద్ధురాలికి అన్నం తినిపించి అందరి మనసును దోచుకున్నారు.

గూడెం వాసుల కష్ట నష్టాలు విన్నారు. వరదల వల్ల ఇబ్బంది పడుతున్న వారికి తక్షణంగా 50,000 వేల రూపాయల నిత్యావసర వస్తువులకు ఆర్థిక సహాయం చేశారు. ప్రతి ఒక్కరికీ ఇండ్లు ,సీఎం కెసిఆర్ దృష్టికి సమస్యను తీసుకెళ్లి వాగు పై బ్రిడ్జి నిర్మాణం చేసి రోడ్లు వేపించి గూడెం వాసుల కష్టాలు తీరుస్తానని, తన సీడీ ఎఫ్ 10 లక్షల నిధులను సీసీ రోడ్డుకి సాంక్షన్ చేశారు.

తమ మారుమూల గిరిజన గూడెంకి కొండలు, కొనలు, వాగు, వంకలు చెట్లు పుట్టలు ఇలా అన్ని కష్టాలను ఎదుర్కొని రావడం సంతోషమనీ, చరిత్రలో ఏ పాలకులు, ఏ ఎమ్మెల్యే రాని తమ దొరవారి గూడెం కి వచ్చిన ఎమ్మేల్యే శంకర్ నాయక్ పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ నిజమైన దొరవారు అంటే ఎమ్మేల్యే శంకర్ నాయక్ అనీ ఆయన పేరును మా గూడెంలో చిర స్థాయిగా గుర్తు పెట్టుకుంటామని అనందము వ్యక్తం చేశారు.ఎమ్మెల్యే వెంట జెడ్పి కో ఆప్షన్ ఎం.డి.ఖాసీం, ఎంపిపి సుజాత మోతిలాల్, సంధ్య, లక్ష్మణ్ రావు, మన్మోహన్ రెడ్డి, రాజు, కత్తి వెంకన్న, భారాస నాయకులు, తదితరులు ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News