జూన్ 2 నుండి 22 వరకు నిర్వహిస్తున్న తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని నియోజకవర్గ ప్రజా ప్రతినిధులతో సన్నాహక సమావేశం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే శంకర్ నాయక్ నిర్వహించారు. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా 21రోజుల పాటు నిర్వహించనున్న కార్యక్రమాలను ప్రజా ప్రతినిధులతో చర్చించినట్లు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే శంకర్ నాయక్ మాట్లాడుతూ తెలంగాణలో గడిచిన 9ఏళ్లలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమం మన కళ్ళ ముందు కనిపిస్తుందని తెలిపారు. సంక్షేమ రంగంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని అన్నారు. ఇప్పటి వరకు జరిగిన ప్రతీ అభివృద్ధి పనిని, అందిన ప్రతీ సంక్షేమ పథకాన్ని ప్రజలకు వివరించాలని సూచించారు. అన్ని వర్గాల ప్రజలను భాగస్వాములను చేస్తూ తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాలను విజయవంతం చేయాలనీ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, ఎంపిపి లు, జెడ్పిటిసి లు, పి.ఏ.సి.ఎస్ చైర్మన్ లు, ఏ.ఎం.సి. వైస్ చైర్మన్ లు, మండల, పట్టణ బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.