సి.ఎం.ఆర్. రైస్ అందించడంలో జాప్యం తగదని జిల్లా కలెక్టర్ శశాంక ఆదేశించారు. కురవి మండలం అయ్యగారిపల్లి వద్ద ఉన్న శ్రీ తిరుమల పారబాయిల్డ్ రైస్ మిల్ ను సందర్శించి పరిశీలించారు. మిల్లులో ఉన్న ధాన్యాన్ని లెక్కించి నివేదిక అందివ్వాలని తాసిల్దార్ ను ఆదేశించారు. మిల్లులో ఉన్న ధాన్యంపై పర్యవేక్షణ చేపట్టాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. తిరుమల రైస్ మిల్లు ప్రతిరోజు ఏడు ఏసీకేలు, శ్రీనివాస నాలుగు ఏసీ కేలు సీఎంఆర్ బియ్యం ని అందించాలన్నారు. బియ్యాన్ని సకాలంలో అందించడంలో జాప్యం జరిగితే చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.
కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ డేవిడ్, సివిల్ సప్లై జిల్లా మేనేజర్ కృష్ణవేణి,తాసిల్దార్ రఫీ,సివిల్ సప్లైస్ డిటి నారాయణరెడ్డి, తిరుమల రైస్ మిల్ ఓనర్ అంబరీష తదితరులు వున్నారు.