Saturday, November 23, 2024
HomeతెలంగాణMahabubabad: ఏకలవ్య ప్రవేశ పరీక్ష ఫలితాల విడుదల

Mahabubabad: ఏకలవ్య ప్రవేశ పరీక్ష ఫలితాల విడుదల

ఏకలవ్య గురుకుల విద్యాలయాలు ప్రవేశ పరీక్ష 2023 -24 ఫలితాలను మహబూబాబాద్ క్యాంప్ కార్యాలయంలో రాష్ట్ర గిరిజన, స్త్రీ- శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ విడుదల చేసారు. అనంతరం మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ .. ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ ప్రవేశ పరీక్షకు 8383 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 7252 మంది విద్యార్థులు ప్రవేశ పరీక్షకు హాజరయ్యారాన్నరు. వీరిలో మొదటి విడతలో 1347 మంది విద్యార్థులు మోటా అడ్మిషన్ గైడ్ లైన్స్ ప్రకారం 23 గురుకులాల్లో సీట్లు కేటాయించడం జరిగిందనీ, సీట్లు సాధించిన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థుల జూన్ 1 నుండి 10వ తారీకు లోపు వారికి కేటాయించిన పాఠశాలలో విద్యార్థులు చేరుతారనీ, ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో గురుకులాల సంఖ్య పెరిగిందనీ, రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించబోతున్నామనీ, సీఎం కెసిఆర్ పాలనలో 1లక్ష 35 వేల మంది విద్యార్థులు గురుకుల విద్యను అభ్యసిస్తున్నారని తెలిపారు. శతాబ్దంలో జరగని అభివృద్ధి సీఎం కెసిఆర్ పాలనలో దశాబ్దంలో జరిగిందన్నారు.
జూన్ 24 నుండి 4 లక్షల ఎకరాలకు పోడు పట్టాలు ఇవ్వబోతున్నామన్నారు. గతంలో ఎన్నడు లేని విధంగా ముఖ్యమంత్రి కెసిఆర్ పాలనలో గిరిజనుల అభివృద్ధి జరిగిందనీ, తండాలను గ్రామ పంచాయతీలు చేయడం, జీపీ బిల్డింగులు నిర్మించడం, గిరిజన ప్రాంతాల్లో రోడ్లు, 10 శాతం రిజర్వేషన్, బంజారా ఆత్మగౌరవ భవనాలు, గురుకులాలు ఏర్పాటు తో పాటు అనేక కార్యక్రమాలు చేపట్టి సీఎం కేసీఆర్ గిరిజనులకు స్వర్ణ యుగాన్ని తీసుకొచ్చారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, ఆశ్రమ పాఠశాలలో పనిచేసిన కాంట్రాక్టు రెసిడెన్షియల్ ఉపాధ్యాయులకు 12నెలల వేతనాలు విడుదల చేసిందనీ, ఈ ఫలితాల్లో మహబూబాబాద్ జిల్లాకు చెందిన కిరణ్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్, పొయ్యారంటే చెందిన హలవత్ ఉమేష్ స్టేట్ సెకండ్ ర్యాంక్ సాధించారనీ, పాఠశాలలో సీబీఎస్ఈ విధానంలోనే విద్యాబోధన అందిస్తామన్నారు.

- Advertisement -

ఆన్లైన్ ద్వారా 9వ తరగతి నుండి 12వ తరగతి వరకు ఐఐటీ కోచింగ్ అందిస్తున్నామనీ అన్నారు. విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించడానికి కృషి చేసిన అధికారులను ఉపాధ్యాయులను సిబ్బందిని అభినందించిన మంత్రి ఇదే స్ఫూర్తిని కొనసాగించాలంటూ వారికి సూచించారు. ఈ కార్యక్రమంలో ఏకలవ్య విద్యాలయాల ఓ ఎస్ డి స్వర్ణలత, డిప్యూటీ సెక్రటరీ చంద్రశేఖర్, ఆర్ సి ఓ రాజ్యలక్ష్మి ,అకాడమిక్ ఓఎస్డి శ్రీనివాస్, మహబూబాబాద్ జిల్లా ఏకలవ్య విద్యాలయాల ప్రిన్సిపాల్లు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News