Friday, September 20, 2024
HomeతెలంగాణMahabubabad: అటవీ అనుమతులు సత్వరమే పొందాలి: కలెక్టర్

Mahabubabad: అటవీ అనుమతులు సత్వరమే పొందాలి: కలెక్టర్

ఏజెన్సీ ప్రాంతం మండలాల అయినా కొత్తగూడ, గంగారం మండలాలలో అభివృద్ధి పనులు ప్రారంభించేందుకు అనుమతులను సత్వరమే పొందాలని జిల్లా కలెక్టర్ శశాంక ఆదేశించారు. ఐడిఓసిలోని కలెక్టర్ సమావేశ మందిరంలో ఏజెన్సీ ప్రాంతాలలో చేపట్టే అభివృద్ధి పనులకు తీసుకోవాల్సిన అనుమతులపై జిల్లా అటవీ శాఖ అధికారితో కలిసి కలెక్టర్ జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కొత్తగూడ, గంగారం మండలాలలో చేపట్టే అభివృద్ధి పనులకు తప్పనిసరిగా ముందస్తు అనుమతి తీసుకోవాలన్నారు.
రోడ్లు భవనాల శాఖ ఆధ్వర్యంలో గుంజేడు నుండి దుబ్బ గూడ, భూపతి పేట నుండి కొత్తగూడ, కొత్తగూడ నుండి పాకాల 3 రోడ్లకు అనుమతులు పొందాలన్నారు. పంచాయతీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో 6 రోడ్లకు ప్రతిపాదనలు అందజేయాలన్నారు. ఐ.టి.డి.ఏ.ద్వారా 3 రోడ్లకు అనుమతులు పొందాలన్నారు.
మత్స్య శాఖ ద్వారా చేపట్టనున్న పాండ్స్ నిర్మాణాలకు తీర్మానం పొందిన తర్వాతనే అనుమతి తీసుకోవాలని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా అటవీశాఖ అధికారి రవి కిరణ్ , ఆర్డీఓ కొమరయ్య, ఇంజనీరింగ్ అధికారులు తానేశ్వర్, సురేష్, రామిరెడ్డి, గిరిజన సంక్షేమ అధికారులు నాగ సాగర్, ఏ.టి.డబ్ల్యూ.ఓ.సత్యవతి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News