వైద్య సేవలను ప్రజలకు అందుబాటులోకి తెస్తామని జిల్లా కలెక్టర్ శశాంక తెలియజేశారు. ఐ.డి.ఓ.సి.లోని కలెక్టర్ కార్యాలయ వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో రాష్ట్ర వైద్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ఉన్నత అధికారులుతో కలిసి జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వివరిస్తూ జిల్లాలో సబ్ సెంటర్ లు పూర్తి కావస్తున్నాయన్నారు. కంటివెలుగు కార్యక్రమంను వేగవంతంగా చేపడుతున్నామని అదేరీతిలో ప్రిష్క్రిప్షన్ గ్లాస్ అందజేస్తున్నామన్నారు. మెడికల్ కళాశాల పనులు పర్యవేక్షిస్తున్నామని, హాస్పిటల్, హాస్టల్ నిర్మాణ పనులు నాణ్యతతో శరవేగంగా పూర్తిచేయుస్తున్నట్లు వివరించారు. వైద్య శాఖ మంత్రి మాట్లాడుతూ జిల్లాకు వైద్యుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలుపుతూ 30కి పైగా అస్టెంట్ ప్రొఫెసర్ లను నియమించడం జరిగిందని, వైద్య సేవలలో ప్రతి నిరుపేదకు ఆధునిక వైద్యం అందుబాటులో ఉండే విధంగా సేవలను ప్రజల చెంతకు చేరేలా చర్యలు తీసుకుంటూ మరింత విస్తృత ప్రచారం చేయాలన్నారు. సి.పి.ఆర్. విధానం పై అవగాహన పరచాలని, ప్రతి ఒక్కరితో గుండెకు రక్తం సరఫరా అయ్యేందుకు శిక్షణ ఇవ్వాలన్నారు.
రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదైతున్నందున ఉపాధిహామీ కూలీలకు షేడ్ నెట్స్ వేయించాలని, త్రాగునీరు, వైద్య శిబిరం ఏర్పాటు చేయించాలన్నారు. ఓ.ఆర్.ఎస్. ప్యాకెట్స్ వెంట ఉండేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వైద్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు కలెక్టర్ లను ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా వైద్య శాఖ అధికారి హరీష్ రాజ్, జిల్లా ఆస్పత్రుల సమన్వయ అధికారి శ్రీనివాస్, ఉప వైద్య అధికారులు అంబరీష, ఉమా గౌరీ, కంటి వైద్య నిపుణులు సత్యనారాయణ, డాక్టర్ సుధీర్ రెడ్డి, ఇంజనీరింగ్ అధికారులు ఉమ మహేష్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.