Saturday, November 23, 2024
HomeతెలంగాణMahabubabad: బంగారు తెలంగాణగా అగ్రగామిగా నిలబెడుదాం

Mahabubabad: బంగారు తెలంగాణగా అగ్రగామిగా నిలబెడుదాం

పోరాడి సాధించుకున్న తెలంగాణ ను బంగారు తెలంగాణ గా అన్ని రంగాలలో అగ్రగామిగా నిలుపుదామని రాష్ట్ర గిరిజన సంక్షేమం, మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఐ డి ఓ సి లో ప్రభుత్వం నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలోజడ్పీ చైర్మన్ అంగోత్ బిందు, జిల్లా కలెక్టర్ శశాంక, ఎస్పి శరత్ చంద్ర పవార్, జిల్లా అటవీ శాఖ అధికారి రవికిరణ్ పార్లమెంట్ సభ్యురాలు మాలోత్ కవిత,ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ , మున్సిపల్ చైర్మన్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి లతో కలిసి మంత్రి పాల్గొని పోలీస్ శాఖ వారిచే గౌరవ వందనం స్వీకరించిన ఆనంతరం జాతీయ పథకాన్ని ఆవిష్కరించి 2014 సంవత్సరం రాష్ట్రం అవతరించిన నాటి నుండి నేటి వరకు సాధించిన ప్రగతిని జిల్లా అభివృద్ధి ప్రగతి నివేదిక ద్వారా సందేశాన్ని చదివి వినిపించారు.
ముందుగా మంత్రి జిల్లా ప్రజలకు, అధికారులకు ,ఉద్యోగులకు, ప్రజాప్రతినిధులకు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం కెసిఆర్ నాడు ఉద్యమ సారధిగా నిలబడి నేడు ముఖ్యమంత్రిగా యావత్ తెలంగాణ ప్రజానీకాన్ని ఏకం చేసి ఒక్కతాటిపై నడిపించి ఉద్యమ స్ఫూర్తి నీ రగిలించి రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చేందుకు సాహసోపేత నిర్ణయాలు తీసుకోవడంలో కృతకృత్యులయ్యారు. భావి భారత పౌరులకు ప్రయోగాత్మకమైన విశిష్టమైన అభివృద్ధి పథకాలను, సంక్షేమ ఫలాలను దేశంలో మరెక్కడా లేని విధంగా ప్రజలకు అందిస్తున్నారని మంత్రి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి నేటి వరకు అన్ని రంగాలలో అభివృద్ధి నీ వేగవంతంగా ముందుకు తీసుకురావడానికి అహర్నిశలు శ్రమిస్తున్నట్లు చెప్పారు. సాధించిన ప్రగతిని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు చేపడుతున్న ఈ మహా యజ్ఞంలో మనమందరం పాలుపంచు కొని సమిధలు గా నిలవాలని మంత్రి ఆకాక్షించారు.
విద్యార్థినీ విద్యార్థులచే ఏర్పాటుచేసిన సాంస్కృతిక సంప్రదాయ నృత్యాలు, బంజారా నృత్యం, సెల్ఫ్ డిఫెన్స్ (కరాటే), తెలంగాణ గీతాలపై విద్యార్థులు నృత్య ప్రదర్శనలు చెయ్యగా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
ఐ డి ఓ సి లోని రెండవ అంతస్తులో ఏర్పాటు చేసిన ఏసీ ఇండోర్ గేమ్స్ రూమును మంత్రి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించి, కలెక్టర్ ఎస్పీ అదనపు కలెక్టర్ లతో టేబుల్ టెన్నిస్, క్యారం బోర్డ్ ఆడి, అధికారులు పని వత్తిళ్లలో ప్రశాంతత కోసం ఆట విడుపుకు చక్కటి ఇండోర్ స్పోర్ట్స్ రూమ్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.
అనంతరం కలెక్టర్ ఏర్పాటుచేసిన తేనేటి విందులో ప్రజా ప్రతినిధులు అధికారులతో మంత్రి పాల్గొన్నారు. ఈ అవతరణ వేడుకలలో, ఏ సి ఎల్ బి అభిలాష అభినవ్, ఏసీ రెవెన్యూ డేవిడ్, ఆర్డీవో కొమురయ్య, ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రజలు, విద్యార్థిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News