Friday, September 20, 2024
HomeతెలంగాణMahabubabad: ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ జన్మదిన వేడుకలు

Mahabubabad: ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ జన్మదిన వేడుకలు

మహబూబాబాద్ శాసనసభ్యులు బానోత్ శంకర్ నాయక్ జన్మదిన వేడుకలు బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు గద్దె రవి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన ఈ వేడుకలకు ఎమ్మెల్యే శంకర్ నాయక్, డాక్టర్ సీత మహాలక్ష్మి దంపతులు పాల్గొని అభిమానుల మధ్య గద్దె రవి ఏర్పాటు చేసిన భారీ కేకును కట్ చేశారు. అనంతరం నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలలో పదవ తరగతిలో ప్రధమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించిన విద్యార్థులకు బహుమతులు అందించి అభినందించారు. తర్వాత మహబూబాబాద్ మున్సిపల్ కార్మికులకు బహుమతులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ డాక్టర్ రామ్మోహన్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ ఫరీద్, కౌన్సిలర్లు మారినేని వెంకన్న, చిట్యాల జనార్ధన్, ఎంపీపీలు, జడ్పిటిసిలు, ఎంపిటిసిలు, సర్పంచ్లు, ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News